మా నాగర్ కర్నూలు జిల్లా వైభవం. (కవిత). బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా .తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్. 9491387977.

మా నాగర్ కర్నూలు జిల్లా వైభవం. (కవిత). బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా .తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్. 9491387977.

మా నాగర్ కర్నూలు జిల్లా వైభవం
--------------&&&&&&&----------------నయా నయా జిల్లా నవనాగరికత జిల్లా
మా నవోదయం జిల్లా మా నాగర్ కర్నూలు జిల్లా
అంగరంగ వైభవాన్ని  కొన తెచ్చెను గా ఇది మల్లా
అంతరంగ ప్రాభవాన్ని కనిమెచ్చెనుగా నిలువెల్ల!

పూర్వపు నామం కందెనవోలంటరు
ప్రస్తుత నామం నాగర్ కర్నూలని వింటరు.
చేరి ఇద్దరు రాజులపై వచ్చానుగా ఈ పేరు
మరి చరిత్ర తిరిగేస్తే తెలుస్తుంది దీని తీరు !

నాగన్న చందన్న అను ఇరువురు రాజులు
పాలించి లాలించి తీర్చిరిగా ప్రజల మోజులు
వారి పేర్లపై వచ్చానుగా నాగనూల్ అని
కాలక్రమేణా స్థిరపడెనుగా నాగర్ కర్నూలని !

పర్యాటక ప్రాంతాలను ఇది కలిగియున్నది
దర్శించే ప్రజలతోని మరి వెలుగుతున్నది
నయా నయా జిల్లా మా  నవోదయం జిల్లా
నవతరం యువతరం తెలుసుకోండి మల్లా !

సలేశ్వరం మహేశ్వరం మల్లెలతీర్థం
అను పుణ్యక్షేత్రాలతో వర్ధిల్లుతున్న ప్రాంతం
కనువిందులు చేస్తూ అందరిని దీవిస్తూ
ప్రకృతి కళా వైభవంతో శోభిల్లుతుంది అసాంతం !

నల్లమల్ల అడవి గూడ ఇందులోనే ఉన్నది ఎదుగుతున్నది
అల్లన మెల్లన ప్రకృతి కన్నెల వన్నెలతో అలరారుతున్నది
మన భారతదేశ మందు రెండవ పెద్ద అడవిగా
తాను పేరు పొంది వర్ధిల్లుతూ వస్తున్నది మస్తున్నది !

కాకతీయ రాజులు పొందుగా ఏలిన ప్రాంతం
నిజాం నవాబులు ఇందు దూరినారు అసాంతం 
కందూరు చోళులు చేసేరిగా ఇల పరిపాలన కొంత
కదం తొక్కిన చాళుక్యులు వాలి పోయిరిగా వారి చెంత !

కళలకు కవులకు కాణాచి మన జిల్లా
కళాకారులకు పరిచింది తివాచి మల్లా
సాహితీ సేవలన్ని కాలేదుగా ఇక డొల్లా
సాహితీ ప్రియులందరినీ దీవించెనుగా అల్లా !

నీవు నేను మనందరం ఇక్కడనే పుట్టినాము గద బిడ్డా
తెలుసుకోని ఏలుకోరా ఓతెలంగాణ బిడ్డా
మేధావులెందరో ఇది  పుట్టినట్టి పురిటిగడ్డ
మన తెలంగాణ బిడ్డలకు అయ్యిందిలే ఇక అడ్డ !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments