గుర్రాల. 9491387977.
గుర్రాల మణిపూసలు.
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
నాగర్ కర్నూల్ జిల్లా.
51). మర్యాదకే నమస్కారం
అదే గదా పరిష్కారం
నీ ప్రవర్తనను తెలుపు
చేయవద్దు తిరస్కారం !
52) రామాయణ గ్రంధం
అద్భుత ప్రబంధం
పారాయణం చేసి
పెంచాలిక బంధం!
53). స్నేహం విలువైనది
మహిలో కొలువైనది
కనుగొని అల్లుకపో
నిన్నే పెనవేస్తుంది !
54) సోదర బంధము గొప్పది
ఎలాచెప్పి మరి విప్పే ది ?
మీరే ముడి విప్పండి
చెప్పండి తప్పేది ఒప్పేది ?
55). గురు విలువ తెలుసుకో
పరువు నీవు నిలుపుకో
చెల్లించు గురుదక్షణను
గురు దేవుని కలుసుకో !