గుర్రాల. 9491387977.
గుర్రాల మణిపూసలు.
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
66). నేడు నడిచేటి పాలన
కెసిఆర్ పరిపాలన
పచ్చగా నడుస్తున్నది
సరైన ఆలన పాలన !
67). ఇరుగుపొరుగును ఆదుకో
ఇల స్థిరమై పాదుకో
సహకారం అందించుమ
అందరి విందు అందుకో !
68). రాము సోము సోదరులు
వారిద్దరూ కవలలు
కలసిమెలసి ఉంటారు
వారు సద్గుణవంతులు !
69). ఎంచుకో మంచితనం
పెంచుకోండి అనుదినం
ప్రదర్శించి చూపండి
మెచ్చుకుంటారు జనం !
70). నిజాయితీగా బతుకు
దొరుకును నీకు మెతుకు
చింతనేది ఉండదు
హాయిగా ఇక బతుకు !
71). అన్నదమ్ముల బంధం
విడిపోని అనుబంధం
రామలక్ష్మణుల పోలి
ఉండేటి సంబంధం!
72). కోనసీమ భగ్గుమంది
అగ్నిజ్వాల అంటుకుంది
జిల్లా మార్పుపై లొల్లి
జనం గుండె ఝల్లుమంది !
73) చేయకు రా నీవు అప్పు
చేస్తే కలుగుగా ముప్పు
అప్పుల్లో మునిగి పోకిక
చేయొద్దు ఇక ఆ తప్పు !
74) పంచవన్నెల చిలకమ్మ
ఇక ఏది నీ కులుకమ్మ
చూయించు ఒక్కసారి క
అందాల మా మొలకమ్మ!
75). దారి తప్పకు తమ్ముడూ
మనసు విప్పకు అమ్మడూ
నిజం తెలిసి నడుచుకొండి
ఏమిటీ మీ కుమ్ముడూ ?