మన శరీరము-పంచ కోశములు. (వ్యాసం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం .సెల్ నెంబర్.9491387977.

మన శరీరము-పంచ కోశములు. (వ్యాసం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం .సెల్ నెంబర్.9491387977.


మన శరీరము-పంచ కోశములు
------------&&&&&&&-------వ్యాసం
యోగ శరీర శాస్త్ర ప్రకారం మన శరీరము పంచ కోశములచే నిర్మించబడినది.
1). అన్నమయ్య కోశము.
2) మనోమయ కోశము.
3) ప్రాణమయ కోశము.
4). అజ్ఞానమయ కోశము.
5). ఆనందమయ కోశము.
      ఈ ఐదు కోశములు సంయుక్తంగా తమతమ ధర్మాలను నిర్వర్తిస్తూ దేహ సమగ్రతను కాపాడడంలో ఉపకరిస్తాయి. ప్రాణాన్ని అదుపుచేయడం, విస్తరించడం మొదలైన పనులను నియంత్రించెడి  సాధన ప్రాణాయామము. ఇది ప్రధానంగా ప్రాణమయ కోశముతో కలసి ఫలితాన్నిస్తుంది. ప్రాణ మయ కోశము పంచప్రాణ నిర్మితము. ప్రాణం, సమాన, వ్యాన ,ఆపాన, ఉదానములనే ఈ పంచ వాయువులు లేక పంచ ప్రాణములు దేహంగములలో విస్తరించి తత్సంబంధ ధర్మాలను నిర్వర్తిస్తాయి.
ప్రాణం: దేహానికి నిరంతరం శక్తి అవసరం. ఆహార రూపంలో గ్రహించబడిన శక్తి, వాయు రూపంలో గ్రహించబడిన ప్రాణవాయువు. ఇవి ఏవైనా శరీరపు జీవరసాయన చర్యకు దోహదపడే శక్తులే. ఇట్టి వానిని బయటనుండి గ్రహిస్తాం. లారింగ్స్ మరియు డయాఫ్రమ్ మధ్యలో  ఈ శక్తి విస్తరించి నిరంతరం వివిధ వనరుల నుండి మరింత అవసరమైన శక్తిని స్వీకరిస్తుంది. ప్రధానంగా మానవుని మనుగడకు కావలసినది శ్వాస. శ్వాస ప్రక్రియను సక్రమం చేసే బాధ్యత ప్రాణవాయువుదే.

సమాన: జీవనాధారమైన శక్తిని గ్రహించిన పిదప దానిని దేహపు అవసరాలకు అనుగుణంగా మార్చేది సమాన వాయువు. ఇది గుండే మరియు నాభి మధ్య స్థిరమైన తన ధర్మం నిర్వర్తిస్తుంది. శరీరంలోని ఏ అంగానికి ఎంత శక్తి అవసరము ఎంత మోతాదులో శక్తిని పంచేది సమాన వాయువు.

వ్యాస:. బయటనుండి స్వీకరించిన శక్తిని దేహంలోని వివిధ అంగాలకు మూసుక వెళ్లే వాహనంగా వ్యాస వాయువు పనిచేస్తుంది. వ్యాస అంటే వాహక మని సాధారణ అర్థము. వ్యాస వాయు ధర్మాన్ని కూడా ప్రాణవాయువు నియంత్రిస్తుంది . శరీరంలోని ఇతర వాయువులకు ప్రత్యేక సమయాల్లో ప్రత్యామ్నాయ వనరులు అందించగలిగే ది ఈ వ్యాస వాయువు. ఇది దేహమంతటా వ్యాపించి ఉంటుంది.

ఆపాన: అపాన మంటే కింది దశలో ప్రయాణించేది అని అర్థం. ఆహార వినియోగ క్రమములో మిగిలి పోయిన వ్యర్థ పదార్థాల విసర్జనకు తోడ్పడేది ఆపాన వాయువు. మూత్రము, మలము వంటి వానిని విసర్జన క్రియకు ఆధారము ఈ ఆపానవాయువు. ఇది  పెద్ద ప్రేగు, మూత్రపిండాలు, మలద్వారం, జననాంగాలకు వాని కర్తవ్య నిర్వహణలో సహాయకారి.
       నాభి, ఉదరం కింది భాగం, కటి ప్రదేశము నందు ఆపాన వాయువు తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.

ఉదాన: ఉదాన పదంలో "ఉద్"అంటే పై దిశలో వెళ్ళేది అని అర్థం. సరస్సులోని చక్షు,శ్రోత్ర, ఘ్రానేఇంద్రియాలను ఉదాన వాయువు నియంత్రిస్తుంది. కాళ్లు చేతులు మరియు దానికి సంబంధించిన కండరాలు, నాడులు, కీళ్ల పైన తన ఆధిపత్యం కలిగిన ఉదాన వాయువు శరీరం నిటారుగా ఉండటంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది మెదడు మరియు శిరస్సులో స్థిరమైన ఉంటుంది.
         మనసుకు సంబంధించిన ఆలోచన, భావవ్యక్తీకరణ వంటివాటిపై కూడా ఉదాన వాయువు ప్రభావం గణనీయంగా ఉంటుంది.
ఉప వాయువులు:.  
--------------------+---
1). నాగ, 2) కూర్మ.3) కృకర4) దేవ దత్త. 5) ధనంజయ.
నాగ వాయువు త్రేన్పులు, వెక్కిళ్లకు కారణమౌతుంది. కూర్మ వాయువు కనురెప్పలని ఆర్పటాన్ని నిర్దేశిస్తుంది. కృకర వాయువు ఆకలి, దప్పిక, దగ్గు, ముక్కుచీదడం వంటి చర్యలకు కారణమవుతుంది. దేవదత్త వాయువు మత్తును, నిద్రను కలిగించుట లో ప్రధాన పాత్ర వహిస్తుంది. ధనంజయ వాయువు వ్యక్తి మరణాంతరం దేహాన్ని కుళ్ళి పోయేలా చేస్తుంది.
శరీరంలోని అణుఅణువుపైన శ్వాస ప్రభావం ఉంటుంది. ప్రత్యేకించి మెదడు సామర్థ్యంపై ఈ ప్రభావం మరీ ఎక్కువ. మనిషి సగటున నిమిషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు. ఒక రోజులో 21600 సార్లు శ్వాసిస్తారని పరిశోధనల్లో తేలింది. శ్వాస సమయంలో ఆక్సిజన్, గ్లూకోస్ వినియోగం అధికంగా ఉంటుంది.
అబద్ధమైన, సక్రమమైన ప్రాణమయ సాధన వలన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందండి. అందమైన జీవితాన్ని గడపండి.  ప్రాణాన్ని మీ స్వాధీనపరచుకొండి.
ఓం శాంతి శాంతి శాంతి.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments