గుర్రాల మణిపూసలు.. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

గుర్రాల మణిపూసలు.. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.


గుర్రాల మణిపూసలు.
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
నాగర్ కర్నూల్ జిల్లా.

46). చదివే మనకు ముఖ్యం
        అదందించు సౌఖ్యం
        అని తెలుపు అందరకి
        వెలగిపోవు వాఖ్యం

47). డబ్బు ప్రధానం కాదు
        దానిని చేసుకో చేదు
        అని చెప్పాలిక అందరికి
        ఆ జబ్బు రానేరాదు !

48). స్నేహమేరా జీవితం
        చేస్తుంది ప్రభావితం
        అనుభవిస్తే ఇక తెలియును
        సదా చెప్పాలి స్వాగతం !

49). గోమాతను ఆదరించు
       సంపద లెన్నో అందించు
       సేవించుమ గోమూత్రం
       గోశాలల ఇక నిర్మించు !

50). ఇచ్చిన మాటను తప్పకు
        అడపాదడపా తిప్పకు
         మాట విలువను తెలుసుకో
         అంతవరకు నోరిప్పకు !

0/Post a Comment/Comments