గీతాసారం . (సంక్షిప్త వ్యాసం). బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్ 9491387977.

గీతాసారం . (సంక్షిప్త వ్యాసం). బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్ 9491387977.

గీతాసారం (సంక్షిప్త వ్యాసం)
------------&&&&&---------------
గీతా గీతా గీతా గీతా గీతా
మాభారతీయ రస సంగీతా
మా గీతా మాతా చేతి వ్రాత
ఆ దేవుని అనుభవాల మోత !

బుద్ధిలో యోగాన్ని ఇస్తుంది 
కర్మ బంధాలను తెంచేస్తుంది
శాంతి ప్రశాంతిని అందిస్తుంది
చింతా బ్రాంతిని తొలగిస్తుంది !

సుఖదుఃఖాలను మార్చేస్తుంది
జీవిత సత్యాలను నేర్పిస్తుంది 
జీవాత్మను పరిశుద్ధం చేస్తుంది
పరమాత్మ ప్రభావం చూపిస్తుంది!

       పరమ పవిత్రమైన భగవద్గీత భగవంతుని అనుభవాల ఆనంద హేల. అనుభవాల సంపుటాల లీల. గీత కర్మ బంధాలను తెంచి కర్మ యోగంగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. జీవాత్మకు పరమాత్మ రసాన్ని అందించడానికి వచ్చింది.
       ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, మరియు భగవద్గీత ప్రస్థానత్రయం. అసలైన పరమాత్మ యొక్క అమృతాన్ని త్రాగడానికి రాజ మార్గాన్ని చూపి నిన్ను సంసార సాగరం నుండి ముక్తి మార్గానికి చేరవేసే ముఖ్యమైన ఈ మూడు గ్రంథాలను సత్ గ్రంథాలని అంటారు. బ్రహ్మసూత్రాలలో విద్వాంసులకు ప్రవేశం ఉంటుంది. ఉపనిషత్తులలో జిజ్ఞాసువులకు ప్రవేశం ఉంటుంది. అయితే గీత విద్వాంసులను ఆహ్వానిస్తుంది. భక్తులకు జ్ఞానాన్ని అందిస్తుంది. స్త్రీలకు కూడా కొన్ని యోగ్యతలను వికసింప చేసుకునే కళను నేర్పుతుంది. అలాగే జిజ్ఞాసువులకు, విద్యార్థులకు  కూడా సక్రమ మార్గాన్ని చూపిస్తుంది.
తద్విధ్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేనసేవయాః
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం
జ్ఞానినస్తత్వదర్శినః !!
అజ్ఞానాన్ని నువ్వు తత్వ దర్శి జ్ఞానుల వద్దకు వెళ్లి తెలుసుకో, వారికి చక్కగా సాష్టాంగ దండ ప్రమాణం చేయడంవల్ల, వారికి సేవ చేయడం వల్ల అలాగే  కపటాన్ని విడిచి సరళ తత్వంతో ప్రశ్నించడం వల్ల పరమాత్మ తత్వాన్ని చక్కగా తెలుసుకున్న అజ్ఞాని మహా పురుషులు నీకు ఆ తత్వజ్ఞానం యొక్క ఉపదేశాన్ని ఇస్తారు (గీతః4.34.)
అలాగే రాజకీయ నాయకులకు కూడా గీత ఎంతోకొంత స్తుంది.
కర్మను ఆచరించు. అయితే కర్మ లో బహుజన సితార యొక్క లక్ష్యాన్ని ఉంచుకో. వినయం, సరళత్వం, సహజత్వం ఈ సద్గుణాలను రాజకీయ నాయకులకు ఇస్తుంది.
        సాధు సంతులకు కూడా గీత తన ఖజానాలో చోటిస్తుంది. బాలుడైన శ్రీకృష్ణుడు వేణువు ద్వారా, కీర్తనల ద్వారా చదువు రాని వారికి బ్రహ్మ విద్య యొక్క అమృతాన్ని ఇచ్చాడు. అలాగే యోగీశ్వరుడు అయినా శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అలసిసొలసిన, కర్తవ్యాన్ని నిర్ణయించు కోవడంలో అసమర్థ స్థితికి చేరుకున్న ఆ కాలం నాటి ప్రసిద్ధ యోధుడైన అర్జునునికి గీత జ్ఞానాన్ని ఇచ్చి అతడికి దిశానిర్దేశం చేశాడు.
           జీవితంలో ఉన్న చిక్కుముడులను తొలగిస్తుంది గీత. ముక్తి మార్గానిక నిన్ను దగ్గర చేస్తుంది. చదువులేని వారికి శ్రీకృష్ణుడు వేణువును మ్రోగించి ప్రేమ ద్వారా చదువుకున్న వారు మరియు చింతన పరులకు ఉపదేశం ద్వారా, అలాగే భావుకుడు భక్తి ద్వారా మరియు ప్రాణ-ప్రధానులకు యోగ ద్వారా, కర్మ ప్రధానులకు నిష్కామ త్వం ద్వారా మేల్కొలుపు తాడు. శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఏమేమి నింపాడంటే అందరికీ దీని నుండిఎంతో లభిస్తుంది.
      కావుననే గీత పూర్తి విశ్వానికి ధర్మ గ్రంథం అయింది జీవ మాత్రుల మేలు గురించి ఉన్న గీతను ప్రతినిత్యం పఠిధ్ధాం. మన జీవితంలోని ఇడుములను తొలగించు కుందాం. ఆనందమయమైన జీవితంతో అలరారుతూ ఉందాం.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments