వారి చేతులు కదలకపోతే
మనకు రోజు గడవదు..
వారి కాళ్ళు నడయాడకపోతే
ప్రపంచం నడవదు..
వారి పనిముట్లు పనిచేయకపోతే
మన పని జరగదు..
వారి చెమట చుక్క రాలకపోతే
మనకు బువ్వ నోట్లోకి వెళ్ళదు..
వారు ఒకరోజు పని మానేస్తే
పరిసరాలు దుర్వాసన వేదజల్లుతాయి..
వారు ఒక దినం విశ్రాంతి తీసుకుంటే
మనం అశాంతికి లోనవుతాము..
వారు లేనిదే మానవ మనుగడ కష్టం!
వారు పనిమానితే ప్రపంచం అస్తవ్యస్తం!!
వారు వారు ఎవరు వారు!?
వారే కార్మికులు,శ్రామికులు,కర్షకులు
పదాలు వేరు వేరు అయినా అర్ధం ఒకటే..
కోడి కూతకు ముందే లేచి వీధుల్లో తిరుగుతూ
మన అవసరాలను తీరుస్తారు.
రక్తాన్ని చెమట చుక్కలుగా చిందించి
మన జీవితాల్లో ఆనందాలు నింపుతారు.
వారి జీవితాలు చీకట్లో మగ్గుతున్న
మన జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతారు.
కష్టానికి తగిన ప్రతిఫలం అందకపోయినా
వృత్తినే దైవంగా భావిస్తారు.
అదనపు పని గంటల భారం మోపినా
విసుగు చెందక సదరు సంస్థ కోసం పనిచేస్తారు..
ఇంటి స్థితిగతులు ఎలా ఉన్నా
ఆరోగ్య స్థితి ఏమైనా
వాతావరణ పరిస్థితులు ఎలా మారినా
చేసే పనిని మాత్రం వాయిదా వేయక
నిరంతరం సమాజాభివృద్ధికై పాటుపడతారు.
శ్రమే ఆయుధంగా,
ప్రజాసేవే ధ్యేయంగా,
కులమతవర్ణవర్గప్రాంత భేదం చూడని
*కార్మిక లోకానికి శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు..*
ఉమశేషారావు వైద్య
లింగాపూర్
9440408080
Post a Comment