సాధన చేయాలి..కృతజ్ఞత చూపాలి

సాధన చేయాలి..కృతజ్ఞత చూపాలి



➡జీవితంలోంచి దువ్వెన అనే వస్తువును తీసేయ్.
అపుడు ఏం జరుగుతుంది?
నువ్వు జడలు కట్టిన జుట్టుతో భయంకరంగా ఉంటావు. 

➡నీ జీవితంలోంచి అద్దం అనే వస్తువును తీసేయ్.
తర్వాత నిన్ను నువ్వే చూసుకోలేనంత అసహ్యంగా ఉంటావు.

➡ఒక్కరోజు ఫ్యాన్ లేకపోతే నిద్ర రాక మరుసటి దినం ఏపనీ సక్రమంగా చెయ్యలేవు.

➡నీ జీవితాన్నే అందంగా, సౌఖ్యంగా చేస్తూన్న ఇలాంటి చిన్న చిన్న వస్తువులకు నువ్వెప్పుడైనా *థాంక్స్* చెప్పావా?
 
➡మూడు పూటలూ నీకు సకాలంలో తిండి ఏర్పాటు చేస్తున్న నీ తల్లికో లేక నీ భార్యకో ఒక్క రోజైనా థాంక్స్ చెప్పావా?

➡మూడు నిముషాలపాటు చెట్లు     స్ట్రైక్ చేస్తే భూమండలం అంతా శవాల దిబ్బ ఐపోతుంది.
చెట్టు యొక్క దయా దాక్షిణ్యాలపై బతుకుతున్న  నీవు ఒక్క రోజైనా ఏ చెట్టునైనా ప్రేమగా స్పర్శిస్తూ థాంక్స్ చెప్పావా?

➡ఎండకూ, వానకూ, అమ్మకూ, నాన్నకూ నిన్ను ఆనందంగా ఉంచుతున్న ఈ ప్రకృతిగురువుకు నువ్వు తినే తిండికి
ఎప్పుడైనా థాంక్స్ చెప్పావా?

➡అంటే నీకు తీసుకోడమే తప్ప ఇవ్వడం రాదన్నమాట!
*సత్యం ఏమిటంటే ఇస్తేనే తిరిగి లభిస్తుంది.*

➡నిజానికి పై వస్తువులేవీ నీ దగ్గరనుండీ ఏమీ ఆశించకుండా... నిస్వార్థంగా....ఎన్నో యుగాలుగా సేవ చేస్తున్నాయి.

➡నీకు సౌఖ్యాన్ని ఇచ్చిన ప్రతీ ఒక్క వస్తువుకు మనసులో కృతజ్ఞత సమర్పించి చూడు!
నీ మనసు పవిత్రతతో కడిగివేయబడి నిష్కల్మషం ఐపోతుంది. 
ఇదే అంతః శుద్ధి!
ఇదే పవిత్రత!
ఇదే దైవత్వం!
ఇలాగే *స్వచ్ఛతను* సాధించాలి.

➡ *సృష్టిలో స్వచ్ఛమైన ప్రతిదీ అత్యంత శక్తి కల్గివుంటుంది.*

➡ప్రతీ రోజూ నీకు సహాయం చేస్తున్న ప్రతీ వస్తువూ, మనిషి, జంతువు, ప్రకృతి..ఇలా అన్నిటికీ హృదయంలో నిండుగా కృతజ్ఞత ప్రకటించడం సాధన చేయాలి. 
ఇది నీకు మరో ప్రపంచాన్ని పరిచయం చేయు
ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్
జి.జె.సి దోమకొండ

0/Post a Comment/Comments