శీర్షిక: పరుగు ఆపకు
నీవనుకున్నది సాధించేందుకు
సాగుతున్న పయనంలో
ఒడిదుడుకులు ఎదురౌతుంటయ్
నిన్ను నీవు నిర్మించుకునే క్రమంలో
పకబ్బందిగా నీ పాదాలు తడబడకుండా
ఆత్మవిశ్వాసం నీకు తోడుంచుకో
వెళ్ళే దారిలో అక్కడక్కడా ఆకర్షణ ముళ్ళపొదలెదురవ్వొచ్చు
నీవంటేమిటో అక్కడేకదా తెలిసిపోయేది
తేలిపోతావా...తెగువతో సాగిపోతావా!?
చిన్న తప్పటడుగు చాలు
నిన్నో అందఃపాతాళానికి విసిరికొట్టేందుకు
గురివైపు పయనించాలి ప్రయత్నం ఇంధనంగా
నీవనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే
ముందు ఆయుధాలనన్ని సరిచూసుకో
బలహీనతెక్కడుందో సరిచేసుకో
సాధనతో అడుగేయ్
సాధించేదాక పరుగునాపకోయ్
సాధించే విజయం
నీవెవరో లోకమంతా తెలిపేదై చరిత్రలో నిలిచేదై ఉండాలోయ్
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.
హామీపత్రం:
----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు