ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా GCS వల్లూరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ అవార్డ్ 2022 కు గాను సాహిత్య రంగంలో కృషి చేసినందుకు ప్రముఖ కవి రచయిత విశ్లేషకులు ఉపాద్యాయులు కొంపెల్లి రామయ్య ఎంపికైనట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా. వల్లూరి శ్రీనివాస్ గారు ఆహ్వానం పంపారు. తేదీ :04.06.2022 న రవీంద్ర భారతి హైద్రాబాద్ లో జరుగు కార్యక్రమంలో మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ గారు, సబితా ఇంద్రారెడ్డిగారు మరియు ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకోనున్నట్లు కవి రామయ్య తెలిపారు.ఈ సందర్భంగా వికాస వేదిక అధ్యక్షులు సాధనాల వెంకట స్వామి నాయుడు ప్రధాన కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్, బుక్కా సత్యనారాయణ , మలిశెట్టి కృష్ణ మూర్తి,గాజుల భారతి శ్రీనివాస్, యడవల్లి శైలజ, మల్సూర్ అలి ,తాళ్ల యోగానందం,భూక్యా హచ్యా, జహీరోద్ధిన్, మద్ధం రమణ మూర్తి,అంగోతు జయ వాసు ,చినహుస్సెన్,గోవింద్, రేళ్ళ శ్రీనివాస్ ,శోభనాద్రి,సీత్లనాయక్ ,కొత్తపల్లి కృష్ణారావు,కొత్త శంకర్ రెడ్డి, పాఠశాల ఉపాద్యాయులు తదితరులు అభినందించారు.