తానా అంతర్జాతీయ గేయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవయిత్రి శ్రీమతి బలివాడ తేజస్విని గారు

తానా అంతర్జాతీయ గేయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవయిత్రి శ్రీమతి బలివాడ తేజస్విని గారు

 

"తానా అంతర్జాతీయ గేయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవయిత్రి శ్రీమతి బలివాడ తేజస్విని గారు"  

ఉత్తర  అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక "ఆజాదీకా అమృత మహోత్సవ్" ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై  ప్రతిష్ఠాత్మకంగా "అంతర్జాతీయ గేయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో శ్రీకాకుళానికి చెందిన కవయిత్రి బలివాడ తేజస్విని గారు  ఎంపికయ్యారు. మే  27, 28, 29 తేదీలలో జూమ్ లో తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి వేదిక మీద  తమ  గేయాన్ని పాడి  వినిపించబోతున్నారు. ఆమె పాడిన "ఒజ్జా(గురువు)" అనే గేయం ఈ పోటీలో  ఎంపికయింది.

ఇంతటి విశేషమైన కార్యక్రమంలో ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్నందుకు తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. అనేకమంది దేశ, విదేశ తెలుగు కవులు, ప్రముఖులు హాజరయ్యే ఈ "తానా గేయ తరంగాలు" కార్యక్రమం తానా అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. "యప్ టీవీ" ద్వారా అమెరికాతో  పాటు, యూరప్ దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈటీవీ భారత్, మన టీవీ, టీవీ ఆసియా తెలుగు మరియు ఇతర మాద్యమాలలో ప్రసారం కానుంది. 

ఆధ్యాత్మిక, సామాజిక స్పృహ కలిగించే రచనలు చేసే  తేజస్విని గారు మూడు భాషల్లో రచనలతో పాటు శ్లోకాలు కూడా రాశారు. పదికిపైగా ముందు మాటలతో పాటు ఎన్నో పుస్తకాలలో తమ కవితలు వచ్చాయి. స్వీయ సంపాదకత్వంలో కూడా పుస్తకాలు రాబోతున్నాయి. వృత్తి రీత్యా తపస్వి మనోహరం అంతర్జాల పత్రిక మరియు పబ్లికేషన్స్లో ప్రక్రియల ప్రాజెక్టు హెడ్ గా, సమదర్శిని అంతర్జాల పత్రిక సబ్ ఎడిటర్ గా పనిచేస్తూనే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఎన్.ఎల్.హెచ్.ఎఫ్. వరల్డ్ రికార్డ్స్ కూడా కైవసం చేసుకున్నారు. 10,000పైచిలుకు కవితలు, కథలు, పుస్తక సమీక్షలు చేస్తూ ఉత్తమ సమీక్షకురాలు అవార్డు పొందారు. ప్రఫౌండ్ రైటర్స్ విలేఖ హెడ్గా, ప్రదన్య సాహితీ వేదిక ఉపాధ్యక్షురాలిగా చేస్తూనే అనేక పోటీలకు సహ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈమె ప్రముఖుల ముఖాముఖీలు కూడా తీసుకుంటారు. అదే విధంగా కుమారుడైన "అంజన్ సాయి వేదాన్ష్ బర్రెడ్డి" ని కూడా బాల కవిగా తీర్చిదిద్దారు.

        ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని  ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన "బలివాడ తేజస్విని"ని నగర పెద్దలు, ప్రముఖులు, సాహితీవేత్తలు  ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


0/Post a Comment/Comments