శీర్షిక:ఆది దైవం
రచన:డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్
**********************
జన్మకు కారణమైన మహనీయత,
త్యాగానికి సరిపోయే సహిష్ణుత,
పృథివిపై నడిచే దేవత,
అమ్మ మనందరి చిరునామా.
ప్రేమ,ఆప్యాయతలు
బాధ్యత,బంధాలు
జననికి పర్యాయపదాలు.
సంతానం బాగు కోసం
నిరంతర తపనతో ప్రయాణం,
విరామమెరుగని కర్తవ్యం,
మాత మహిలో మహాదాత.
తను సదా పూజిత.
అమ్మకు వందనం!
జీవితమే ఆమె ఇచ్చిన
బహుమానం!!