"రంజాన్ పర్వదినం'
-------------------------------
వచ్చింది రంజాన్ పండుగ
తెచ్చింది సంతసం మెండుగ
రంజాన్ పవిత్ర మాసము
ఎద ఎదలో మధుమాసము
'మహమ్మద్' గారు ప్రవక్తగా
నియామకం అయిన దినము
ఫిత్రాదానం చేయు దినము
ఘన రంజాన్ పర్వదినము
నింగిని నెలవంకకు ప్రధానము
నెలరోజులూ ఉపవాసము
"అల్లా" తో సహవాసము
జీవితాల్లో సమాధానము
శుభములు కొనితెచ్చు పండుగ
భగవంతుని దీవెనలు నిండుగ
చల్లగ ఉండాలి జీవితాలు
రంజాన్ "శుభాకాంక్షలు"
--గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు