పుడమి శోకం
ధరిత్రి కన్నీళ్లు రాక
దిగులుతో దినదినం దిక్కుతోచని దీనస్థితిలో రోదిస్తోంది
మనిషినెంతో ప్రేమించి తల్లిలా లాలించి
కడుపునింపుతుంది
తన ఒడిలో దాచిన సమస్తాన్ని తనపై వసించే మానవులకందిస్తుంది
పుట్టింది మొదలు తనువు చాలించేంతదాకా
ఓపికతో ఓదార్పునిచ్చి కడలితీరం దాటిస్తోంది
జగతినంతా నిండు ముత్యైదువలా అలంకరించే నాటి మోటు మనిషి
ప్రకృతినంతా పచ్ఛదనాన్నద్ది
సస్యశ్యామలంగా మంగళకరంగా మానవీయతను చాటేవాడు
కష్టానికి చెమటచుక్కల నీరుకట్టి పుడమినంతా పులకరింపజేసేవాడు
కాలుష్యమెరగనివాడు పచ్ఛదనంతో చెలిమిచేసవాడు
నాటి మానవుడు భూమికంతా రక్షణకవచమైనాడు
సోమరితనానికి శత్రువతడు
కానీ...
నేటి నవ నాగరిక మానవుడు
ప్రకృతికంతా వికృతయ్యాడు
అన్యాయానికి చిరునామా
అందమైనదెదున్న చిదిమేయడమే తెలిసినోడు
నాగరికత మోజులో గాజులమేడల్లో జీవనం
చెట్లను నరకడమే తెలిసిన రాక్షసతత్వం
ప్లాస్టిక్ భూతాన్ని భూమిపైకెదజల్లి భూతాపాన్ని పెంచేసిన వినాశనకారి
సాంకేతికతెంత పెరిగిన
సర్వనాశనానికి సోపనమైంది
ఓజోన్ పొర నేడో డేంజర్ జోన్
విపత్తులెన్నో ఎదుర్కున్నాం
విపరీతబుద్దే వినాశకాలన్నట్టు
ప్రకృతి కన్నెరంతజేసినా
కుక్కతోక బుద్ది వంకరటింకరే
ధరణి అణువణువునంతా తవ్వుతూ
లక్ష్మణరేఖలనన్నీ దాటేస్తుంటే
కాలం కాటేయకేంజేస్తది
తను తవ్వుతున్నది తనగోతేనని తెలుసుకోలేని మాయావ్యూహంలో ఇరుక్కుపోయాడిపుడు
పుడమి చెట్లులేక తల్లడిల్లుతోంది
పచ్చదనంలేనో ఎడారిని తలపిస్తోంది
చివరికి మనిషి తడారినగొంతుతో తనువు చాలిస్తాడేమోనని
తల్లి పిల్లల బంధం మరి
సి.శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557