రత్నాల సరాలు' పుస్తకావిష్కరణ మరియు వంద పుస్తకాలు బహుకరణ-గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు

రత్నాల సరాలు' పుస్తకావిష్కరణ మరియు వంద పుస్తకాలు బహుకరణ-గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు

'రత్నాల సరాలు' పుస్తకావిష్కరణ మరియు వంద పుస్తకాలు బహుకరణ
----------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హెచ్.మురవణి లో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న  ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న రచించిన 'రత్నాల సరాలు'  పుస్తకావిష్కరణ జిల్లా    
గ్రంథాలయం కర్నూలు నందు ఇద్దరు లైబ్రరీయన్ల పదవీ విరమణ సందర్భంగా శ్రీ సుభాష్ చంద్ర బోస్ చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ కర్నూలు, శ్రీ.శ్రీనివాసరెడ్డి కార్యదర్శి జిల్లా గ్రంథాలయ సంస్థ కర్నూలు ,కల్కుర ,గంగాధర్ రెడ్డి మాజీ  ఛైర్మన్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కర్నూలు మరియు గోవిందరెడ్డి అధ్యక్షులు జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం  చేతుల మీద ఘనంగా జరిగింది.తదనంతరం గద్వాల సోమన్న తాను వ్రాసిన వంద  (100) పుస్తకాలు గ్రంథాలయానికి బహుకరించారు.చక్కని కవితను చదివి వినిపించారు.తెలుగు సాహిత్యానికి ముఖ్యంగా బాలసాహిత్యానికి పెద్దపీట వేస్తూ అనతికాలంలోనే 18 పుస్తకాలు రచించడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న గద్వాల సోమన్న అందరూ ప్రశంశలతో ముంచెత్తారు.వారి తెలుగు సాహితీ కృషిని,ప్రతిభాపాటవాలను గొనియాడారు.
   ఈ కార్యక్రమంలో గ్రంధాలయ  అధికారులు, సిబ్బంది మరియు పుర ప్రముఖులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments