శీర్షిక:శేషప్రశ్నలు
రచన:డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.
**********************
మోసం లేని వ్యాపారం
అబద్ధం చెప్పని రాజకీయం
దౌర్జన్యం చూపని అధికారం
కల్మషం పుట్టని స్నేహం
వన్నె తగ్గని ప్రణయం
వసివాడని బాల్యం
వంత పాడని కర్తవ్యం
పక్షపాతం పొందని ధర్మం
భ్రష్టు పట్టని సత్యం
సులభంగా దక్కని న్యాయం
పతనం కాని విలువలు
మృగ్యమవుతున్న మంచితనం
కనుమరుగవుతున్న సంస్కృతి మనుగడ
కానరానిదవుతున్న మానవత
పెరిగిపోతున్న దానవత
సంస్కారం ప్రదర్శించని విద్య
తృప్తి నివ్వని సంపాదన
ఆప్యాయత పంచని సంతానం
అవకాశం దొరకని ప్రతిభ
ప్రభావరహితమైన సిద్ధాంతం
పరిణతికి నోచుకోని వయస్సు
చెప్పిన మాట వినని మనస్సు
స్వయంకృతాపరాధమైన ఆయుష్షు
పనికిరానిదైన విజ్ఞానం
దూరాలు పెంచే ఆచారం
భక్తిభావరహితమైన పూజ
నిలకడ చెదిరిన వ్యక్తిత్వం
కాలం చెల్లుతున్న చట్టం
పాటింపబడని నియమం
అతిగా ప్రయోగించే లౌక్యం
అర్థమే అవ్వని జీవితం
ప్రశ్నగానే మిగిలిపోయిన సమానత్వం
శేషప్రశ్నలే శాశ్వతం.