*పొగసూరిన ఊపిరి* శ్రీలతరమేశ్ గోస్కుల

*పొగసూరిన ఊపిరి* శ్రీలతరమేశ్ గోస్కుల

*రోజుకొక్క దమ్ముతో వదిలిన ఆయువు*
*నీ వాళ్ళందరి నుండి నిన్ను దూరం చేయును..*

అవును..
అలా అలా గాలిలో అందంగా తేలిపోతు
ఒకదాని వెంట ఇంకొకటి..
రింగులు రింగులుగా దండలల్లిన తీరుగా...
సుడులెన్నో తిరుక్కుంటూ
చుట్టల్లో దాగిన అద్భుతాలు సుడిని మార్చే సుడిగుండాలు...

పొగసూరిన ఊపిరితో
బక్క చిక్కిన డొక్కలతో
బీటలు వారే జీవితానికి దారులు వేస్తు..
మత్తువైపు గమ్మత్తుగా నెట్టేసే
నిశీధి నలుముకున్న ఎండమావులు..

నిషా కోరల్లో బంధీయైన బతుకును
దినమొక్కోతీరుగా కబళిస్తుంటే..
పొగరింగులకై మోజుపడ్డ పాణం
కాలకూట విషమై..
మెల్లమెల్లగా మారిపోవు తెల్లటి బూడిదగా కాయమంతా...

కోరి తెచ్చుకున్న చావుతో కాలిపోవుటకన్నా
నీతో పాటు నీ చుట్టుపక్కలకు
కారుమబ్బులాంటి పొగను రాకుండా దూరంగా తరమాలి..
మసి పూసే బతుకుతో మలినపడే బదులు
మంచి అలవాట్లతో చైతన్య దిశగా..
నీ అడుగులన్నీ తారకలై మెరవాలి...

*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్*

0/Post a Comment/Comments