ఎన్. టి.ఆర్ స్మృతిలో

ఎన్. టి.ఆర్ స్మృతిలో

ప్రత్యేక్ష దైవమా
నటనలో జీవత్వం
ఆంధ్రుల ఆరాధ్యదైవం
కృష్ణుడిల గోపిక వనం లో
పుల్లనా గ్రోవి తో
సరసన్ని పండించిన
రాముడి ల భూవిపై
దేవుడే నడియాడిన ట్టు
రావణ బ్రహ్మ ల 
వీలనీజం ప్రదర్శించిన
సాటి ఎవ్వరు నీకు
నట కౌశలం
సాంఘికం అయిన
పౌరణికం అయిన
జానపదం అయిన
ఆకాశమే హద్దుగా
విశ్వరూపాన్ని చూపిన
నట బ్రహ్మ
నటనలో యోధుడు
పాత్ర ఏది అయిన
అట్టే ఆహార్యం తో ఇమిడిపోయే
బొబ్బిలి పులి
యుగంధర్
లవకుశ 
పుణ్యభూమి నా దేశం
నీ నటన నైపుణ్యం
లక్ష డాక్టరేట్లకు పరిశోధన
కు గ్రంథాలయం
   అసమాన్యుడి వై
భారత రాజకీయ చరిత్ర
నీవొక చరితవు
తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక
తొమ్మిది నెలల్లో సాధించావు
అప్రతీత విజయాన్ని
కీలో రెండు రూపాయల బియ్యాన్ని ఇచ్చి పేదోడి కడుపు నింపావు
జనతా వస్త్రాలు ఇచ్చి
మండల వ్యవస్థ తెచ్చి
ప్రజల ముంగిట పాలనకు కూర్పు ఇచ్చావు
మహిళ రిజర్వేషన్స్
తెలుగు విశ్వవిద్యాలయం
హెల్త్ యూనివర్శిటీ
సార్వత్రిక విశ్వవిద్యాలయం
స్థాపించి న మొదటి ముఖ్యమంత్రి మీరు
బడుగుల కు చేయూత
తెలుగు వారి దీవిటి
నీవొక శక్తి కాదు వ్యవస్థ
ఎన్జీవోడు అని అన్న అని
ఆప్యాయంగా తెలుగువారి
గుండెల్లో సూర్యప్రభ
చంద్ర కాంతి ఉన్నంత వరకు
నీ కీర్తి అజారామం
భౌతిక మరణమే కానీ
శాశ్వత0గా నిలిచే ప్రభ వు
యుగపురుషుడవు నీవు
నా అక్షరాల తో ఒక జ్ఞాపిక
అశ్రునయనాల మధ్య
నీకు వందనాలు
   ఉమశేషారావు వైద్య
   9440408080

0/Post a Comment/Comments