గ్రంథాలయనికి 'రెండు వందల పుస్తకాలు' బహుకరణ--బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

గ్రంథాలయనికి 'రెండు వందల పుస్తకాలు' బహుకరణ--బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

గ్రంథాలయనికి 'రెండు వందల పుస్తకాలు' బహుకరణ
--బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న
----------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హెచ్.మురవణి లో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న  ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న రచించిన 18 పుస్తకాలలో రెండు వందల పుస్తకాలు ఎమ్మిగనూరు గ్రంథాలయనికి ,విచ్చేసిన పాఠకుల సమక్షంలో,స్థానిక లైబ్రరీయన్ హరికృష్ణ చేతుల మీద బహుకరించారు. తదుపరి వివిధ అంశాలపై పోటీలో విజేతలైన ప్రతిభా ప్రయివేటు పాఠశాల 25మంది విద్యార్థులకు ప్రోత్సాహకాలుగా 50 పుస్తకాలు ఆ స్కూలు కరెస్పాండెంట్ శ్రీనివాసులు చేతుల మీద అందజేశారు.అనంతరం కవి,రచయిత,దాత  గద్వాల సోమన్నను లైబ్రరీయన్, సిబ్బంది,పాఠకులు,విద్యార్థులు ఘనంగా సన్మానించారు. బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న మాట్లాడుతూ తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి చేయాలని, విజ్ఞాన సముపార్జనలో భాగంగా పుస్తక బాండాగారాలైన గ్రంథాలయాలను  సద్వినియోగం చేసుకోవాలని సూచించారు."పుస్తకమే హస్తభూషణమని,పుస్తక పఠనం శ్రేష్టమైన అలవాటు" అని అభివర్ణించారు.వారి సాహిత్య సేవలను,దాతృత్వాన్ని  వక్తలు కొనియాడారు.

0/Post a Comment/Comments