ఆమె మనోగతం

ఆమె మనోగతం


శీర్షిక: ఆమె మనోగతం
పేరు:ఇడుకుల్ల గాయత్రి 
ఊరు: హైదరాబాద్, మదినగూడ


శీర్షిక: ఆమె మనోగతం

అహల్య, ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావు... ఇంట్లో చింటూ ఆకలి గా ఉంటాడు, అని తెలుసు కదా!! ఎన్నిసార్లు చెప్పినా... నువ్వు మారవా!! అరుస్తున్నాడు కృష్ణ🤨😡

ఏమండీ !అది ! బెల్లు మ్రోగగానే గబగబా బయటకి వస్తుంటే, ప్రిన్సిపాల్ గారు మీటింగ్ ఉందంటూ, అందరినీ ఆపేశారు .తప్పనిసరి పరిస్థితుల్లో ఆగిపోవాల్సి వచ్చింది. స్కూల్లో!! మీకు మెసేజ్ పెట్టడానికి కూడా అవకాశం లేదు.  పది నిమిషాలు అని చెప్పి కూర్చోబెట్టి మీటింగ్ కొనసాగించారు.. చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నారు. మధ్యలో పర్మిషన్ అడగడానికి కూడా అవకాశం దొరకలేదు....

ఏంటి? రోజూ ఏదో ఒక కొత్త నాటకమా! స్కూల్ టైం లోనే మీటింగులు పెట్టుకోవాలి ,కానీ ఇదేమిటని ,అడగాలి కదా!! స్కూల్ ఏ కాదు, ఇంటి బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వర్తించాలి ..ఇంకొక సారి ఇది రిపీట్ అవ్వ కూడదు! బెల్టు విరిగే దాకా కొడతాను !!అంటూ హెచ్చరించాడు కృష్ణ.

నేను అక్కడ ఒక సాధారణ ఉద్యోగిని నీ , అందరితో పాటు నేను. నేను ఒక్క దాన్ని ఆ విధంగా చెప్పలేను కదండీ! అయినా ఇందులో నా తప్పేంటి! జీతం ఇస్తున్నప్పుడు వాళ్ళు చెప్పినట్లు వినాల్సిందే కదా !మీరు మాట్లాడిన అంత తేలిక కాదు! వారిని ఒప్పించడం, మీరు ఇంకెవరైనా మా స్కూల్లో టీచర్స్ ని అడగండి.

ఇలానే చెప్తావ్ ఎప్పుడు! అని, రుసరుసలాడుతూ కోపంగా పళ్ళు కొరుకుతూ ,నాకు టీ తీసుకుని రా! అంటూ ఆర్డర్ వేశాడు..

అహల్య మనసు దహించుకు పోతోంది .ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో చాలా ఓపికగా, సరేలే! నా భర్త నన్ను కాకపోతే ఇంక ఎవరిని అంటారు... బయట ఏదో సమస్య వేధిస్తున్నట్లు గా ఉంది! ఆ చిరాకు నా పైన చూపిస్తున్నాడు, తప్ప, నా మీద కోపం కాదు, అయినా మా చింటూ కోసమే కదా! కోప్పడ్డాడు! అని ,తన మనసుకి సర్ది చెప్పుకుంది.

కృష్ణ కి టి ఇచ్చింది... తర్వాత ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుని ,చింటూ నీ పక్కన కూర్చోబెట్టుకుని ,తనకి హోంవర్క్ చేపించి ,అన్నం తినిపించి, పడుకోబెట్టి ,కృష్ణ కి టిఫిన్ రెడీ చేసి, బెడ్ అంతా సర్దేసి, అతనికి కావలసిన మందులు అన్ని ఇచ్చేసి, కిచెన్ సర్దుకుని ,పడుకునే సరికి ఒంటి గంట అయ్యింది .ఉదయం నాలుగు గంటలకు లేచి పోయింది, ఇది ప్రతి రోజూ తన దినచర్య...

కృష్ణ ప్రతిరోజు చిరాకు పడడం, సర్దుకుపోతూ ఉండడం, సంసారం ముందుకు నెట్టుకొని వెళుతూ... తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా, నిరంతరం శ్రమిస్తూ,
ఇంటాబయటా కష్టపడుతూ... అయినా కూడా విలువ లేకుండా... భర్త అనే మాటలను ఓర్చుకుంటూ... మౌనంగా తన  వేదన తనలోని అణుచుకుంటూ, ప్రతిరోజు గడిచిపోతోంది ,నిరంతరం ఒక చక్రంలో తిరుగుతున్నట్లుగా ఉంది జీవితం....

రోజు లాగే హడావిడిగా హడావిడిగా ,ఇంట్లో పనులన్నీ ముగించుకొని స్కూల్కి బయలుదేరింది, అహల్య, ప్రేయర్ అయిపోయి క్లాసులోకి వెళ్లగానే ప్రిన్సిపల్  నుంచి నోటీసు వచ్చింది. ఆ నోటీస్ లో ఉన్న విషయం ఏమిటంటే నెక్స్ట్ పీరియడ్ టైం కి, ఫేమస్ ఐఏఎస్ ఆఫీసర్ మిస్సెస్ సుధా శ్రీనివాస్ గారు, స్కూల్ ఆడిటోరియంలో, పిల్లలకు స్పీచ్ ఇవ్వడానికి వస్తున్నారని, ఆ పేరు వినగానే ,అహల్య ఎంతో ఆనందంగా అనిపించింది. ఎన్నాళ్లుగానో ఆమెని కలవాలన్న కోరిక ఈ విధంగా తీరబోతుంది... అందుకు ఎంతో సంతోషపడింది ...

సమయం అయ్యింది...అందరూ కలిసి ఆడిటోరియంలో కి చేరుకున్నారు.....అనుకున్న సమయానికి అతిధి వచ్చేసారు ...అంత చాలా తక్కువ సమయంలో జరిగిపోయింది..

సుధా శ్రీనివాస్ గారు ఆడిటోరియమ్లోకి నడిచి వస్తూ ఉంటే, ఆమె  హుందా తనం, ఆమె మొహం లోని ఆత్మస్థైర్యం.. ఆమె వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నట్లుగా ఉన్నాయి...

సభకి నమస్కారం చెప్తూ సుధా శ్రీనివాస్ గారు ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఆమె చెబుతూ ఉన్న ఒక్కో మాట ఒక్కో బాణంగా తగులుతుంది అహల్య కి... చప్పట్లతో హాలంతా మారుమ్రోగుతూ ఉంటే, అహల్య గుండెల్లో మాత్రం ఎవరో తనని చంప పగల కొడుతున్నట్టుగా ఉంది.... కనుల లోపలికి చేరిన దుఃఖాన్ని మనసులోనే ఆపేసి, మనసుకు పట్టిన పొరలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఉంటే, తన మనో దర్పణంలో తనకు తనే కొత్తగా కనిపిస్తూ ఉంది... అంత అద్భుతంగా ఉంది ఆ ప్రసంగం...

ఈ సమాజం ఒకప్పుడు వేరు, ప్రస్తుతం వేరు, స్త్రీ మరియు పురుషులు ఇద్దరూ సమానంగా పోటీ పడుతూ వెళ్తున్నారు , ఒకప్పుడు స్త్రీలని ఇంటికే పరిమితం చేశారు ,కారణం ఆ రోజులలో స్త్రీలను చాలా అపురూపంగా చూసుకునే వాళ్ళు ,రక్షించుకోవడం కోసం ఇంటికే పరిమితం చేశారు ..కానీ ఈ రోజు ప్రతి స్త్రీ చదువుకుంటోంది... ఎందరో స్త్రీలు తమ దైర్య సాహసాలు తో, మనకి ఈరోజు గొప్ప సమాజాన్ని ఇచ్చారు ,స్త్రీ శక్తిని ప్రపంచానికి పరిచయం చేశారు. పురుషుడితో సమానంగా ప్రయాణం చేయగలిగే అవకాశాన్ని కల్పించారు.. ఈరోజు సమాజం స్త్రీ మరియు పురుషుడు ఇద్దరి కోసం కూడా సిద్ధంగా ఉంది.. కానీ ఇక్కడ ఎవరికి వాళ్లు ప్రశ్నించుకోవలసినది ఏమిటి? అంటే, మీకు మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా ? మీకేం కావాలో మీరు తెలుసుకోండి. ఒకరికి నచ్చినట్టు గా జీవించడం కాదు! మీకు నచ్చినట్టుగా జీవించడం తెలుసుకోండి. మిమ్మల్ని మీరు మొదట గెలుచుకుంటే, సమాజంలో గెలవడం చాలా సులభం.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి, ఒక్కసారి ఓడిపోయిన అంతమాత్రాన, భూమి బ్రద్దలు అవ్వదు.. ఎందుకు ఓడిపోయాడు కారణాలు వెతుక్కోవాలి.. ఎక్కడ ఓడిపోయాను.. అక్కడి నుంచి మొదలు పెట్టాలి.. అది ఒక వ్యక్తి గెలుపు అవుతుంది.. అంతేకానీ ఈరోజు నీకు 10 మార్కులు తక్కువ వస్తే నువ్వు తెలివి తక్కువ వాడివి అని అర్థం కాదు, ఒక ప్రశ్న నిన్ను మీ సామర్థ్యాన్ని లెక్క పెట్టలేదు... నువ్వేంటి అనేది నీకు మాత్రమే తెలుసు.. అది మొదట నువ్వు గ్రహించాలి.. జీవనానికి, జీవితానికి సంబంధించిన విలువలు తెలుసుకుని ప్రతి మనిషి మసలుకోవాలి.. ఈ సమాజంలో ఎవరూ తక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదు, స్త్రీపురుషులు ఇరువురు కూడా సమానం.. ఇద్దరు పరస్పరం గా ఒకరినొకరు గౌరవించుకోవడం.... మీరందరూ కలిసి అలాంటి గొప్ప సమాజాన్ని నిర్మించే సైనికులుగా తయారవ్వాలి అంటూ, చాలా గొప్ప గొప్ప విషయాలను పంచుకుంటూ ప్రసంగాన్ని ముగించారు, సుధా శ్రీనివాస్ గారు.

ఆ ప్రసంగం విన్న తర్వాత ఆలోచనలో పడింది అహల్య, సాయంత్రం ఇంటికి రాగానే ఇంటితో పాటు, మనసుని కూడా శుభ్రం చేసింది, ఎవ్వరు సపోర్ట్ చేసినా చేయకపోయినా, తను అనుకున్న లక్ష్యం సాధించాలనే నిర్ణయం తీసుకుంది. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, ఎక్కడా ఎవరికీ ఇబ్బంది కలగకుండా, తన లక్ష్యసాధనకు కృషి చేసింది .ఆ సాధన కె తన పాఠశాలలో ఆధారంగా చేసుకుంది .తన కలల సాఫల్యం చేయడానికి అక్కడి నుంచి ప్రారంభం మొదలు పెట్టింది.

తన లక్ష్యం ఒక్కటే, పిల్లలకి పుస్తకాల్లో పాఠాలు కాదు, జీవితంలో దానిని అనునయించి శక్తి రావాలి, దాని కోసం ఏమి చేయాలి, అనే ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఈ సమయంలో తీరిక లేకుండా పుస్తకాలు చదివేది. వారిలో అవగాహన పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు ,వాటిని సఫలీకృతం చేస్తూ ,చాలా తక్కువ కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అహల్య, ఆత్మవిశ్వాసంతో తన తిరుగులేని అస్త్రాలన్నీ విద్యార్థులపై ప్రయోగించి ,వారందరినీ గొప్ప స్థాయికి తీసుకొని వచ్చింది.

ఇలా తన హక్కులని, తను పొందడానికి ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ, తన భర్త యొక్క గౌరవాన్ని కూడా తను గెలుచుకుంది .నెమ్మదిగా అతనిలో మార్పు మొదలయ్యింది. స్త్రీ శక్తి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాడు.. తను చేసిన పొరపాటు తెలుసుకుని ,మరెప్పుడూ ఆమెకి చేదోడుగా నిలబడి, ఇద్దరూ కలిసి ఎన్నో గొప్ప స్థానాలను అధిరోహిస్తారు..

సమాజంలో మార్పు కు కలిసి కృషి చేశారు. ఇలా అహల్య మనోగతం, అంతర్మధనం ఎంతోమందికి వెలుగురేఖలు పంచింది ..అలా ప్రతి స్త్రీలో అంతర్మధనం మొదలవ్వాలి, తన మనోగతాన్ని తాను తెలుసుకునే శక్తి ఉద్భవించాలి ,తనలో ఉన్న అపనమ్మకం ఆగిపోయి ,ఆత్మవిశ్వాసం అనే కేతనం ఎగుర వేయ గలగాలి. స్త్రీ మారితే కుటుంబం మారుతుంది .కుటుంబం మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే సమస్తం శుభప్రదం అవుతుంది. స్త్రీ యొక్క శక్తి వలన ఎన్ని మార్పులు సమాజంలో జరుగుతాయి .ప్రతి పురుషుడు కూడా సమయానికి అన్ని సమకూర్చే ఒక అమ్మగా కాకుండా, స్త్రీ యొక్క శక్తిని గుర్తించి, తనలోని భావాలని దర్శించి, ఆమె యొక్క మనోగత ప్రతిబింబాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలగాలి ,ప్రతి స్త్రీ విద్యావంతురాలు అవ్వాలి. స్త్రీ విద్య ఉన్నతమైన శక్తిగా ఎదగాలి ,చిన్ననాటినుంచే స్త్రీపురుషులు అనే సమానత్వాన్ని పిల్లలు అర్థం చేసుకునే విధంగా ఈ సమాజం తయారవ్వాలి ..అప్పుడే మహిళా సాధికారత సాధించ బడుతుంది.. ప్రతి స్త్రీ ఒక అహల్య లాగా తన మన:ప్రతిబింబాన్ని దర్శించి ఈ సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించ గలగాలి అని కోరుకుంటూ ...

సెలవు మరి

0/Post a Comment/Comments