ధరల మంట

ధరల మంట

ధరల మంట
ఒక పక్క ఉక్క పోత
మరోప్రక్క వడదెబ్బ
దాని పై ధరల దెబ్బ
పేద మధ్యతరగతి కుదేలు
గ్యాస్ గుదిబండ అయే
కడుపులోని గ్యాస్ మంటను
తలదన్నే
పాలు పెరుగు రేట్లు పల్స్ రేట్లు
పెంచి బి.పి కి తంటా
కూరగాయలు కుదేలు చెయ్య వట్టే
పెట్రోలు  తోలు తియ్య వట్టే
అన్ని ధరలను ట్రోల్ చెయ్య వట్టే
ధరలు ఆకాశం లోని చుక్కలై
ఆదాయం ఐస్ ల ఆవిరి 
కా వట్టే
రాజకీయ నాయకులు
విమర్శలు ప్రతివిమర్శలే తప్ప
ధరలకు కళ్లెం వేయుటలో వెనుకంజ
రూపాయి విలువ పతనం
ద్రవ్యోల్బణం సామాన్యుడికి
ఏమి ఎరుక
అంకెల గారడీలు చూపి
ప్రభుత్వాలేమో తప్పదు
అని జవాబు చెప్పవట్టే
ధరల తో
తంటాలు తలనొప్పులుఆ
ఇంటిట ఇదే కథకమిషు
 పండ్ల ధరలు పగలబడి నవ్వా వట్టే
ఆరోగ్యానికి డాక్టర్లు తినమని చెప్పిరి
లంకె.కుదురక కుదేలు అవుతున్న
సగటు జీవి వేదనకు అడవి కాచిన వెన్నెల
మరుస్తున్నాయి మధ్యతరుగతి బతుకుల
ఉమశేషారావు వైద్య
9440408080

0/Post a Comment/Comments