అవిశ్రాంత కార్మికుడా

అవిశ్రాంత కార్మికుడా

అవిశ్రాంత కార్మికుడా

శ్రామికుడా
అవిశ్రాంత కార్మికుడా
చాలని జీతాలు
అందని లాభాలు
పట్టుబట్టినా పొందలేని ఫలాలు...నీవి
రేయి,పగలు కారే స్వేదం ముందు
భానుని భాస్వరం మంట దేనికి
కనలేని స్వప్నం ముందు
సుఖమయ వెన్నెల ఎందుకు
వత్సరాలు తరబడి
హూనమైన జీవితం ముందు
జీతాలు పెంపు ఎంత
ఓడిపోయిన బ్రతుకున
సేదదీర్చే గంజిలా
వాడిపోయిన ముఖాన
ఓదార్పే ఆక్సిజన్ లా
అనుక్షణం బ్రతికే  అల్పజీవులం 
మెాయలేని బాధలల్లె 
బంధమైన బంధువులం
చేయికలిపి...అడుగు సలిపి
ఒక్కరై నిలిచే కార్మికులం

రచన
డా!!బాలాజీ దీక్షితులు పి.వి
తిరుపతి
8885391722

0/Post a Comment/Comments