*సాహితీ ధనికుడు*శ్రీలతరమేశ్ గోస్కుల

*సాహితీ ధనికుడు*శ్రీలతరమేశ్ గోస్కుల

శారదా దేవేంద్రుడి ఒడిలో
ఉదయించిన 'రవి'కిరణమే
అత్యున్నుతుడైన దేశ ఆభరణం...

'అభిలాష'తో అంకురార్పణ చేసి
'అనామకుడిగా'తొలి దశల మొగ్గల సృజియించి
వనపుష్పాలెన్నో పూయించిన
తన సగభాగ తనువుకి
'స్మరణ' తో అంకితం చేసిన
సున్నిత కవీంద్రుడే
గీతాంజలి సృష్టికర్త.....

మహాత్మ సంబోధనతో సంబుర పరిచి
గురుదేవ్ గా కీర్తింపబడిన
'చండాలిక' నాటక సూత్రదారుడు....

జీవితాంతం దేశసేవే సంతోషమని
 'ష్యామలి'లో బాధలన్నీ పాతరేసి
'కొత్త పూలు-ఫలాలతో' పరిమళాలు వెదజల్లిన
సంగీత సాహిత్య ప్రేమికుడు....

రాజా ఓ రాణి...చిత్రాంగద...
క్షణిక...గీతాంజలి... విశ్వకవీంద్రుడి రచనలెన్నో అలరించగా...

ప్రకృతినే బడిగా మలిచి
జన హృదిన నిలిచిన
శాంతిని కేతనుడే...నోబెల్ గ్రహితుడు....

వాస్తవాలను నవలల్లో పువ్వులుగా పూయించి
'పురబి' సంధ్యాగీతాలతో' 
ప్రతి మదిని మెప్పించిన చిత్రకారుడు...

బహుముఖ ప్రజ్ఞాశాలియైన ఠాకూరే
నిరాడంబరతకు నిలువెత్తు సాక్ష్యమైన సాహితీ ధనికుడుగా రవీంద్రనాథ్ టాగూర్  శారదా దేవి వరప్రసాదుడుగా..
అందరి హృదయాంతరాలలో చిరస్మరణీయుడు...

శ్రీలతరమేశ్ గోస్కుల
హుజురాబాద్.

0/Post a Comment/Comments