శీర్షిక:వీరపుత్రులు
రచన:డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.
**********************
దేశరక్షణే ధ్యేయం
నియమబద్ధ జీవనం.
నిబద్ధతే చిరునామా
వీరత్వమే వీలునామా.
కఠోర పరిస్థితుల నెదుర్కొంటూ,
కర్తవ్యపాలన చేస్తారు.
భరతమాత నుదుటి తిలకాలై,
శాశ్వతంగా నిలుస్తారు.
త్రివర్ణ పతాకమే స్ఫూర్తిగా
సరిహద్దుల కాపలా కాచి,
కుటుంబాలకు దూరంగా నిలిచి,
బాధ్యతల బంధాన్ని కొలిచి,
ప్రాణాలకు వెరవకుండా,
వెనకడుగు వేయకుండా,
గడ్డకట్టే మంచైనా,
దొంగ దెబ్బ తీసే శత్రువైనా,
ఎదుర్కొనే దేశరక్షకులు
సదా మీకు నమస్సులు.