అంశం అమ్మ -- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై

అంశం అమ్మ -- పేరు అద్దంకి లక్ష్మి ఊరు ముంబై


తేదీ 9_05_22
అంశం అమ్మ ప్రక్రియ గజల్

 ప్రాణాలను పణం పెట్టె
 ప్రేమ మూర్తి అమ్మ కదా
 జీవితాన్ని ప్రసాదించె త్యాగమూర్తి అమ్మ కదా

  కౌగిలిలో హత్తుకొనీ కన్నీరుని  తుడిచి వేసి
 ముద్దాడుతు పెంచుకొనే సేవ మూర్తి అమ్మ కదా

  తేనెకన్న తీయనైన  మాటలనూ ముద్దచేసి  
 కడుపునిండ తినిపించే అమృతమూర్తి అమ్మ కదా

 కష్టాలను ఓర్చుకుంటు ఇష్టాలను మార్చుకుంటు
  కొవ్వొత్తిగ వెలుగిచ్చే జ్ఞాన మూర్తి అమ్మ కదా

 మాతృభాష సొగసులన్ని మనసు దీర  వినిపిస్తూ
  తొలిపలుకులు పలికించే సుగుణ మూర్తి అమ్మ కదా

  త్యాగానికి మరో పేరు సృష్టికంత  మూలమైన
  అవనిరూపు అమ్మ దాల్చె కరుణ మూర్తి అమ్మ కదా

 అమ్మ రుణం ఎన్నటికీ తీర్చలేము ఓ లక్ష్మీ
 పలకరించు ప్రేమ మీర దైవ మూర్తి అమ్మ కదా

పేరు అద్దంకి లక్ష్మీ
 ఊరు ముంబై


0/Post a Comment/Comments