తమలపాకుల ప్రాముఖ్యత

తమలపాకుల ప్రాముఖ్యతహిందూ ధర్మంలో తమలపాకు ప్రాముఖ్యత... తమలపాకు లో ఎవరు కొలువై ఉంటారో తెలుసా??🍃🍃

తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం?


🍃హిందూ ధర్మంలో తమలపాకు ప్రాముఖ్యత... తమలపాకు లో ఎవరు కొలువై ఉంటారో తెలుసా??

🍃హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో

(1. పూలు 2. అక్షింతలు, 3. ఫలాలు,4,అద్దం, 5. వస్త్రం, 6. తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8. కుంకుమ) ఒకటిగా భావిస్తారు.

🍃కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.

🍃పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం. భారత దేశం లో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు.

🍃భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదల లోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకు ని తప్పని సరిగా ఉపయోగిస్తారు.

🍃దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.

🍃తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం?

🍃క్షీర సాగర మథనం లో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణం లో చెప్పబడింది.

🍃శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెబుతున్నాయి.

🍃తమలపాకు యొక్క మొదటి భాగం లో కీర్తి, చివరి భాగం లో ఆయువు, మధ్య భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.

🍃తమలపాకు లోని ఏయే భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాంతమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.

🍃సరస్వతీదేవి మధ్యభాగం లో ఉంటుంది.

🍃తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది.

🍃జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.

🍃విష్ణుమూర్తి తమలపాకు లో ఉంటాడు.

🍃శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగం లో ఉంటారు.

🍃తమలపాకు లోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు.

🍃భూమాత తమలపాకుకి కుదిభాగం లో ఉంటుంది
 ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments