క్షీణిస్తున్న విలువలు....
దిగజారుతున్న సమాజం
తరగతిగదిలో ముద్దుపెట్టుకుంటున్న విద్యార్థులు!
పెళ్ళిపీటలపై ముద్దులాడుకుంటున్న వధూవరులు !!
వివాహవేదికపై నాట్యం చేస్తున్న వధువు !
కల్యాణమండపంలో వధువును కొడుతున్న వరుడు!!
పబ్బులో పోట్లాడుకుంటున్న యువతీయువకులు !
నడివీధిలో నవ్వులపాలవుతున్న మద్యపాన ప్రియులు !!
పట్టపగలు ప్రాణం తీస్తుంటే పట్టించుకోని పౌరులు!
ఫోను నొక్కుకుంటూ నాకెందుకనుకుంటున్న ప్రజలు!!
ప్రియురాలిని పొడిచి చంపుతున్న ప్రియుడు !
ప్రియుడి గొంతుకోస్తున్న ప్రియురాలు!!
భార్యతో వ్యభిచారం చేయిస్తున్న భర్త !
ప్రియుడితో భర్తను చంపిస్తున్న భార్య!!
నెలలపిల్లను నేలకేసి కొడుతున్న తండ్రి!
ఆడపిల్లని చెత్తకుప్పలో వేస్తున్న తల్లి !!
తల్లితండ్రులను తరిమికొడుతున్న తనయులు!
ఆస్తిలేదని వెళ్లగొడుతున్న వారసులు !!
వేరేకులంవాడిని వివాహమాడిందని
సోదరిని సంహరిస్తున్న సహోదరులు!
మరోమతంవారిని మనువాడాడని
మట్టుబెడుతున్న బంధువులు !!
వెల్లువవుతున్న విడాకులు!
వీచేనా విలువల వీచికలు !!
పేట్రేగిపోతున్న పదవీకాంక్ష!
ఫలించేనా ప్రజల ఆకాంక్ష!!
ఆధునికత అవధులు దాటిపోతుంది!
అనుభవాల సారం విలువ లేనిదయ్యింది!!
వ్యక్తిగత స్వేచ్ఛ పరిధులు దాటింది!
విశృంఖలత వెర్రి తలలు వేస్తుంది !!
అన్యాయం న్యాయం చెబుతోంది!
అక్రమాలు అంబరమంటాయి!!
నేరాలు నింగిని తాకాయి!
ఘోరాలు గొప్పలుపోతున్నాయి !!
అలుముకుంటున్న అరాచక రీతులు !
ఆందోళనకలిగిస్తున్న ఆటవికతాగమన సూచికలు!!
విశృంఖలత సోపానాలపై జీవనగతులు !
వికారం కలిగిస్తున్న వ్యవహార తీరులు!!
స్వేచ్చాజీవనమని సంబరపడుతున్నాం!
సరదాగా ఉంటున్నామని సంతోషపడుతున్నాం!!
ఆటవికత ఆవరిస్తోందని
అరాచకత్వం అలుముకుంటోంది....
అందుకనే.. విలువలతో కూడిన విద్య
నైతిక విలువలతో జీవన విదానము
చిన్న ,పెద్ద ల పట్ల గౌరవ మర్యాదలు
నేర్పండి., మన పెంపక లోపమె నేడు సమాజంలో జరుగుతున్న వికృతాలు.
అవగతంకాని అయోమయంలో ఉన్నాం!!
పరిష్కారం మనచేతుల్లోనే
వేమన పద్యాలు,సుమతి శతకలు,కబీర్ ,తులిసి దాస్ పద్యాలు,ఆధ్యాత్మిక విలువలు, పిల్లల ముందు చేయకూడని పనులు నిలువరిద్దాం
నైతిక నియమాలు పుస్తకాల్లో కాదు ఆచరణ లో చూపుదాం
ధర్మోరక్షితి రక్షితః
ఉమశేషారావు వైద్య
లెక్చరర్
9440408080