*కవిత్వంలో ప్రయోగాలు*
కవిత్వం లో
ఓ నూతన అధ్యాయం
కవుల ఈ కవితా ప్రయోగం
ఒక్కో సమయంలో
ఒక్కో కవి
ఒక్కో నూతన ప్రక్రియలను
పరిచయం చేయటం
వివాదం లేనిది
సమాజానికి ఉపయోగపడేది
ఏదైనా మంచి ప్రయోగమే
భాష ముఖ్యం
భావం ప్రధానం
సాహిత్యమే ఓ సృజనాత్మకం
కవి హృదయం లో
భావుకత స్పందించటం లో
రాయాలి అనే ఉత్సుఖత
మంచి కవిత్వ ప్రయోగానికి నాంది అనొచ్చు
కవి తన
అనుభవాన్ని జోడించి
కవి మానసిక స్థితి కి అద్దం పట్టే
భావజాల కవిత్వం
ఓ నిండైన ప్రయోగం
పదాలు పద్యాలుగా
అక్షరాలు శిలాక్షరాలుగా
చరిత్ర లో
నిలిచి పోయిన ప్రయోగ
సందర్భాలు ఎన్నో
సజీవంగా నిలిచిపోయే
కవిత్వమే ద్యేయం గా
అందించిన కవిత్వానికి
లోకం ఎప్పుడూ
నీరాజనం పలుకుతుంది
✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️
దొడ్డపనేని శ్రీ విద్య
పుట్టపర్తి
సత్యసాయి జిల్లా