అక్షర నక్షత్రాలు--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు

అక్షర నక్షత్రాలు--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు

అక్షర నక్షత్రాలు
----------------------------------------
అక్షరాల వనములోన
ఆనందము విరియును
అజ్ఞానము వైతొలగి
విజ్ఞానము కురియును

అక్షరాల కాంతిలో
అపురూపము జీవితాలు
తలరాతలు మారిపోయి
చక్కబడును  జాతకాలు

జీవిత గమనంలో
ఆయుధాలు అక్షరాలు
భవిష్యత్తు గగనంలో
అవే కదా నక్షత్రాలు

అక్షరాలు నేస్తాలు
ఆదరించు హస్తాలు
అడుగడుగునా  అండ
అమ్మ ప్రేమకు ఆనవాలు
--గద్వాల సోమన్న ,
         ఎమ్మిగనూరు. 

0/Post a Comment/Comments