జయ జయహో దుర్గమ్మ - దొడ్డపనేని శ్రీ విద్య

జయ జయహో దుర్గమ్మ - దొడ్డపనేని శ్రీ విద్య


*శీర్షిక: జయ జయహో దుర్గాంబ*


శక్తి స్వరూపిణి మా దుర్గమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మ
శుక్రవారపు పొద్దు దర్శనం
పరాశక్తి విశ్వరూప రక్షణం 

త్రిశూల ధారిణి అవతారం
తిలకించే జనుల సంబరం
సదా సకల శక్తి సామర్థ్యం
మెండుగా జగన్మాత అనుగ్రహం

దుర్గమ్మ ను కొలిచే భక్తుల విశ్వాసం
తొలగును సకల ఆపదలు మాయం
సుఖ సౌఖ్యాలతో వర్థిల్లు లోకా సమస్తం
గాయత్రి మంత్ర జప ఫలితం

మనస్సు బుద్ధి చిత్తం మన ఆధీనం
త్రిగుణాతీత కామేశ్వర స్వరూపం
మహిమాన్వితమైన నవదుర్గ శక్తి రూపం
బ్రహ్మ చైతన్య శ్వేత పద్మాసనం

కోటి సూర్య ప్రభలతో అనుగ్రహ మోక్షం
అమ్మా దుర్గమ్మ కరుణించమ్మ
కష్టాల కడలి నుంచి గట్టెక్కించేమ్మ
నీవు తప్ప మాకు వేరే దిక్కే లేదమ్మ
నీవే దిక్కమ్మ దుర్గమ్మ మాయమ్మ 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏పేరు : 
*దొడ్డపనేని శ్రీ విద్య*
విజయవాడ
శుక్రవారం

0/Post a Comment/Comments