కవి పేరు:: Dr. కందెపి రాణీ ప్రసాద్ వూరు :: సిరిసిల్ల అంశం :: నేటి ఉగాది
శీర్షిక : కరోనా ప్రపంచం
ప్రక్రియ: వచన కవిత్వం
తుమ్ముల తుంపర్ల వేప పూలు నీరస గానాల స్వరాల కోయిలలు కారే ముక్కుల మామిడి ముక్కలు ఉగాది పచ్చడి కరోనా పచ్చడి చలి జ్వరం తో చైత్ర మాసంలో వణుకుతూ వసంత మాసం వేల వేల బోయిన కవి సమ్మేళనం ఉగాది కాలం కరోనా కాలం కలవరపడి పంచాంగ శ్రవణం తిరగ బద్ద రాజ్య పూజ్యాలు పలచ బడ్డ పచ్చని ప్రకృతి ఉగాది కాంతులు కరోనా కాంతులు కరోనా కిల కిల లు కరోనా కావ్యాలు కరోనా పద్యాలు,కరోనా పాటలు కరోనా పండుగలు,కరోనా పబ్బాలు కరోనా ప్రపంచం కరోనా ప్రాభవం.