ముగిసిపోని ప్రేమ --- బొడ్డు హారిక కలం పేరు: కోమలి

ముగిసిపోని ప్రేమ --- బొడ్డు హారిక కలం పేరు: కోమలి


ముగిసిపోని ప్రేమ

చూసింది క్షణకాలం అయిన
మాటలు మూగబోయిన
ఆశలు ఆవిరి అయిన
దూరం పెరిగిపోయిన
ప్రేమ పొందలేక పోయిన
ప్రాణం ధరిత్రిని విడిచిన
బంధం ముడి పడక పోయిన
బ్రతుకు భారం అయిన
ఆయువు ఆశగా మిగిలిన
అశృవులు ఆవిరిగా మారిన
హృదిలో వ్యథ మహా సాగరమైన
జ్ఞాపకాలే జతగా మారిన
పలుకులకై పరితపిస్తూ
మరు రాకకై వేచి చూస్తూ
తృటి తృటిలో తపిస్తూ
వర్ణమాలతో మైత్రి చేస్తూ
పదాలతో పలకరిస్తూ
ప్రేమించిన ప్రేమ ప్రాణానికై పరితపిస్తూ
కాలంతో కలవరపడుతూ
మనసెరుగని మరమనిషిగా మారిపోయాను కదా...

--- బొడ్డు హారిక
కలం పేరు: కోమలి
రాజమహేంద్రవరం
తూర్పు గోదావరి జిల్లా0/Post a Comment/Comments