చిక్కు లెక్క విప్పండి .నెం -3. బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

చిక్కు లెక్క విప్పండి .నెం -3. బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

గుర్రాల.        9491387977.
చిక్కు లెక్క విప్పండి. నెం.3.
-----------&&&&&--------------
శ్రీశైలం క్షేత్రము నందు ఏడు లింగములు కలవు. ఆ లింగమునకు సమీపంలో ఒక కొలను కలదు. కొలను ప్రక్క ఓ కలువ పూల చెట్టు ఉంది. లింగముల పూజించుటకు  ఒక బ్రాహ్మణుడు ఆ చోటికి వచ్చేను.
       తన మనస్సు కోరుకున్నన్ని పూలను కోసాడు. ఆ పూలను చేతిలో పట్టుకొని కొలనులో మునిగాడు. ఈశ్వర మహిమచే అతని చేతిలో ఎన్ని పూలు ఉన్నవో అన్ని పూలు హెచ్చెను. అనగా రెట్టింపు అయినవి. ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో పూలను చూసుకుని అందులో నుండి కొన్ని పూలను లెక్కించి మొదటి లింగమునకు అర్పించి పూజించెను. తరువాత మిగిలిన పూలను చేతపట్టుకొని మరల కొలనులో మునగగా మునుపటి మాదిరి రెట్టింపు అయ్యేను. ఆ పూల నుండి, మొదటి లింగమునకు ఎన్ని పూలు సమర్పించాడో అన్ని పూలు తీసి రెండవ లింగమునకు అర్పించెను.
మరల ఇలా వరుసగా అతను కొలను లో మునిగి ఏడు లింగాలకు సమముగా పెట్టగా చివరకు చేతిలో పూలు లేక పోయెను.
కనుక ఆ బ్రాహ్మణుడు ఎన్ని పూలు తెంపాడు ? ఎన్నేసి పూలు లింగాలకు పెట్టినాడు?
       మనసుపెట్టి చదవండి
        జవాబు మీరు తెలపండి

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments