చిలకమ్మా! మా మొలకమ్మ! (బాల గేయం) బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి. నాగర్ కర్నూలు జిల్లా .తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్. 9491387977.

చిలకమ్మా! మా మొలకమ్మ! (బాల గేయం) బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి. నాగర్ కర్నూలు జిల్లా .తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్. 9491387977.

గుర్రాల.          9491387977.

చిలకమ్మా! మా మొలకమ్మా!
-----------&&&&&&--------------
చిలక చిలక ఓ రామ చిలక
ఎందుకు నీకు మరింత అలక
 పంచవన్నెల మా శ్రీరామచిలక
పంచదారగుళికల రవ్వల మొలక

చిలకా చిలకా  ఓ రామ చిలక
పంచవన్నెల  రంగుల మొలక
ఎందుకు నీకిక ఈవింత అలుక
పండిన జాంపండు నీవింక తినక

చిలక చిలక ఓ రామ చిలక
చిగురాకులలో దాగిన మొలక
ఎక్కడ ఉన్నది నీ చిరునామాం తెలియక ఉన్నాం అయ్యో రామ

చిలక చిలక ఓ శ్రీరామ చిలక
ఉలకకపలకక ఎందుకు అలక
ఊరిలోకి రాకుండా ఏడ ఉన్నవు
మరి ఈడదాగి ఏం చేస్తున్నవు ?

చిలక చిలక మా శ్రీ రామ చిలక
ఇల్లు విడిచి మరి నీవు వెళ్ళినంక
బెంగ పెట్టుకుంది మా చిట్టి చెల్లి
చింత పట్టుకుంది లే మాకు మళ్ళీ

పచ్చాపచ్చని ఓ రఘురామచిలక
వెచ్చావెచ్చని మాముద్దుల మొలక
ఇకనైనా ఎక్కడున్నా నీవు రావమ్మ
చక్కనైన ఎర్రముక్కు మా చిలకమ్మ

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments