గుర్రాల. 9491387977.
మేం పెంచుకున్న పిల్లి !
-------------------------------
మ్యావ్ మ్యావ్ పిల్లి
మా మంచి బుల్లి పిల్లి
మా పంచ నున్న పిల్లి
మేం పెంచుకున్న పిల్లి !
దాని పేరు శ్రీవళ్ళి
పెట్టింది నా చెల్లి
అది తిప్పే గల్లి గల్లి
అలసిపోయే నా చెల్లి!
పొద్దుగాల లేస్తుంది
పాల కోసం చూస్తుంది
మా చెల్లి పెట్టిన పాలను
తాను వెళ్లి త్రాగుతుంది !
పాలు త్రాగినంక మాబుల్లి పిల్లి
తన మీసాలను దువ్వుతుంది
ఆ దృశ్యం చూసిన మా చిట్టి చెల్లి
తాను పకపక మంటూ నవ్వుతుంది !
పిల్లి మొగ్గలు వేస్తుంది మా బుల్లి పిల్లి
గల్లి గల్లి కెళ్లి తాను మళ్లీ మళ్లీ
చూసినవారంతా మెచ్చుకున్నరు
పాలు పోసి రుణం వారు తీర్చుకున్నరు !
ప్రశంసలు అందుకున్న మా బుల్లి పిల్లి
ప్రశ్నించుటకు వారికడకు తాను వెళ్లి
తనకు గుడి కట్టించాలని కోరింది
కట్టిస్తేసరే లేకుంటే మీకుఉరేఅంది !
ఔరా ఇది పిల్లా పులా ఏమిటిలా
మనల అదిరిస్తున్నది బెదిరిస్తున్న ది
ఏం చేసి తొలగించుకోవాలి దీనిచింత !
ఊరి వారంతా మా ఇంటికి వచ్చి
జరిగిన సంగతి పూస పూస గుచ్చి
చెప్పుకున్నారు మాతో వారంతా మేమే గుడి కట్టించి తీర్చాం వారిచింతా !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.