గుర్రాల. 9491387977.
అపారమైన శివలింగాలు (వ్యాసం)
-----------&&&&&&--------------------
శివలింగం ఏ పదార్థంతో తయారు చేయబడినదో, ఆ పదార్థమును బట్టి శివలింగములు అనేకం. అపారం. మరి ఏ పదార్థంతో చేసిన శివలింగం సర్వ శ్రేష్టమైనది అన్నది గుప్తమైన రహస్యం. ఈ రహస్యాన్ని "మేరు తంత్రం"అను శాస్త్రం ఇలా తెలిపినది.
"కోమలేషు త లింగేషు పార్తివం శ్రేష్ట ముచ్యతే"
భావం:. మృదు లింగములలో మట్టి లింగములు శ్రేష్టమైనవి.
కఠినేషు తు పాషాణం పాశాణాత్ స్పాటికం పరమ్.
భావం: కఠిన లింగాలలో రాతి లింగములు శ్రేష్టమైనవి. వీటికంటే స్పటిక లింగములు సర్వ శ్రేష్ఠమైనవి.
స్పాటికాత్ పద్మరాగస్య కాశ్మీరం పద్మరాగాత
భావం: స్పటికం కంటే పద్మరాగ లింగములు శ్రేష్టమైనవి. వీటికన్నా
కాశ్మీర లింగములు సర్వ శ్రేష్టమైనవి.
కాశ్మీరాత్ పుష్యరాగోత్థం ఇంద్ర నీలోద్బవం తాతకు
భావం: కాశ్మీరా లింగము ల కంటే పుష్యరాగ లింగములు శ్రేష్టమైనవి. దీనికంటే ఇంద్ర నీల లింగములు సర్వ శ్రేష్టమైనవి.
ఇంద్ర నీలాచ్చ గోమేధం గోమేదాద్వి ద్రుమోద్భవం
భావం:. ఇంద్ర నీల లింగముల కంటే గోమేదిక లింగములు శ్రేష్టమైనవి. వీనికన్నా పగడము ల లింగములు సర్వ శ్రేష్టమైనవి.
విద్రుమన్మౌక్తికం శ్రేష్టం తస్మాత్ శ్రేష్టం
తు రాజతం.
భావం: పగడముల లింగాల కంటే ముత్యపు లింగములు శ్రేష్టం. వీనికన్నా వెండి లింగములు సర్వ శ్రేష్టం.
హైరణ్యం రాజతాత్ శ్రేష్టం హైరణ్యాద్దీరకం పరమ్.
భావం: వెండి లింగాల కంటే బంగారు లింగాలు శ్రేష్టం. వీటికన్నా
వజ్ర లింగాలు సర్వ శ్రేష్టం.
హీరకాత్ పారదం శ్రేష్టం బాణలింగం తతః పరమ్
భావం: వజ్ర లింగాల కంటే పాదరసలింగం శ్రేష్టం. వీటికన్నా బాల లింగాలు సర్వ శ్రేష్టం.
సర్వ లింగాల కంటే బాణలింగం సర్వ శ్రేష్టమని తెలుసుకున్నారు.
ఈ బాల లింగం కింద ఓ చిన్న పౌరాణిక కథ ఉంది.
బాణాసురుడనువాడు గొప్ప శివ భక్తుడు. మహాతపసంపన్నుడు. ప్రహ్లాదుని మునిమనుమడు ఇతడు. శివుని కోసం ఇతడు నర్మదా నది తీరాన శివుని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏమి వరము కావాలో కోరుకోమనగా, మీరు సదా లింగ రూపంలో ఈ తపో భూమిలో ఉండాలని కోరుకున్నాడు. శివుడు వరాన్ని ప్రసాదించాడు. ఆ వర ప్రభావము వలన నర్మదా నదిలో సహజంగా పుష్కలంగా ఉప్పన్నమయ్యే లింగాలనే బాణాలింగాలని అంటారు. అలా వీనికి పేరు వచ్చినది. అప్పటినుండి శివుడు బాణాలింగ రూపంలో ఈ భూమిపై అవతరించాడు. కాబట్టి ఈ బాణా లింగాన్ని ఆరాధిస్తూ మనమంతా శివానుగ్రహం పొంది పరమ పావనులమౌదాం
ఓం నమశ్శివాయ నా మనోహరాయ! ఆహా ఓహో రాయ!
గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.
సెల్ : 9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.