నా పుట్టిన ఊరు . (ముత్యాల హారాలు ప్రక్రియలో వ్రాసిన కవిత.) బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

నా పుట్టిన ఊరు . (ముత్యాల హారాలు ప్రక్రియలో వ్రాసిన కవిత.) బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

నా పుట్టిన ఊరు (కవిత)
---------&&&&&--------------
నే పుట్టి పెరిగిన ఊరు
కవుల కుర్తి ఓ సారు
గుర్తించారుగా మీరు
ఇక మరువరులే తమరు !

మా ఊరును విడువలేను
ఆ పేరును మరువలేను
ఊరి చివరన మా చేను
ఉండ  ఎలా మరిచేను?

కవులకు పుట్టినిల్లు ఇది
ఘన కీర్తిని పొందినది
అని తెలిసి మురిసేను మది
జగమెరిగిన సత్యమిది. !

మా ఊరి కవులందరు
కలిసిమెలసి ఉందురు
కవితలు వ్రాస్తారు వారు
అవి కలిగిస్తాయి హుషారు !

ముద్రిస్తారు గ్రంథాలను
ఇస్తారు ప్రబంధాలను
చేస్తారు ఇక విందులను
పిలుస్తారు బంధువులను!

సభలు సమావేశాలు
నెలకు నాలుగు రోజులు
జరిపే మహారాజులు
కల్వకుర్తి కవిరాజులు !

ఊరంచున బొడ్రాయి
ఉందిగా చూడవోయి
అది మహిమ గల రాయి
లోకులు అంటున్నారోయి !

ఇట్టి మా ఊరి గడ్డ
కవులకు అయ్యింది అడ్డ
అందులో నాకో ఉడ్డ 
కేటాయించారు బిడ్డ !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments