తెలంగాణ పునర్నిర్మాణం … రాజేంద్ర, 6302324734.

తెలంగాణ పునర్నిర్మాణం … రాజేంద్ర, 6302324734.

 తెలంగాణ పునర్నిర్మాణం


తెలుంగు ఆణే మే తెలుగుల పోరాటం
తొలి మలి దశ ఉద్యమ జయగీతం

కోటి రతనాల వీణ నా బంగారు తెలంగాణ
ప్రతి ఒక్కరూ రుద్రవీణ మీటి చాటే రోజు ఎప్పుడో

పోరాట ఆకాంక్షలు అమరవీరుల ఆశయాలు
కనుమరుగవక నెరవేరేది ఎప్పుడో

భాష యాసల రక్షణ చరిత్ర పునర్నిర్మాణం
ఆకలి దప్పులు లేని తెలంగాణ
ఆవిష్కృతం అయ్యేది ఎప్పుడో

నీళ్ళు నిధులు విద్య వైద్యం ఉద్యోగాలు
ఆత్మగౌరవ పోరులో రైతు ఆత్మగౌరవం
రక్షించబడేది ఎప్పుడో

సకల జనుల చరిత్ర చరిత్రకెక్కేది ఎన్నడో
అలులుపెరుగని అమరవీరుల త్యాగాలు
స్మరించబడేది ఎన్నడో

చరిత్ర నిర్మాతలు ప్రజలే యుద్ధంలో
ముందుండి నడిపే సైనికులు
ఉద్యమం ఇంకా ముగియలేదు
తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి

తెలంగాణమున ప్రతి ఇంటా రుద్రవీణ మోగాలి
ప్రతి ఒక్కరూ కోటి రతనాల వీణను చేతబట్టాలి

అభివృద్ధే మన ధ్యేయమంటూ ప్రతిఒక్కరూ కదలాలి
మన తల్లి తెలంగాణను బంగారుమయం చేయాలి

జై తెలంగాణ…! జై హింద్….!!


… రాజేంద్ర, 6302324734.




0/Post a Comment/Comments