సెనార్థులు చేయండి( కైతికాలు)

సెనార్థులు చేయండి( కైతికాలు)

విభజనకు నాటిన మాట
దూరె నాడు జనాలింట
ప్రతి గడప పరుగు తీసి
బలమెంతో చూపెనంట
ఔనౌను అలుపు లేదు
నర నరాన సత్తువ కదా

చౌరస్తాలన్ని
కాళి నగారాలకు
నాట్య మాడినాయి
ఉసిళ్ళ పుట్టలూరుటకు
అదే జన సంద్రపు హోరు
భావోద్వేగపు జోరు

పిడికిలెత్తి నడిచినారు
పిడుగుల్లా దూకినారు
సబ్బండ వర్ణాలు
అలుపు లేక పోరినారు
ఔనౌను లక్ష్యానికి 
వంతెనలై నిలిచినారు

ఇప్పుడిప్పుడని చెప్పె
ఇజ్జతు లేని మాట లకు
ఉద్వేగం తట్టలేక
ఊపిరిడిచినందుకు
వారేవ్వా త్యాగం
నేడాయెనెందరికో భోగం

ఉద్యోగం జలమంటే
ఉడుం పట్టు పట్టారు
ఐదేండ్లు దాటాక
చేవ చచ్చి పోయారు
గడియ తీరుబడి లేదు
గవ్వ కూడా మిగులు లేదు

పని చేయకింట్లుంటె
పథకాల హారాలు
పని చేసె వారికేమో
పెరిగిన పన్ను భారాలు
ఔనౌను పెంచినదంతా
అడుగడుగున పంచుడే

పేదవారి పథకాలు
పేదలకైతేనె ఇంపు
పెద్దలు బొక్కగ చూస్తే
సోమరులను పెంపు
వారేవ్వా పథకాలు
పేదరికం తెంపాలె

ధరలన్ని చుక్కలందె
జనమంతా అప్పులాయె
రోడ్లు ప్రాజెక్టు లన్ని
గుత్తె దారుల గుడ్లాయె
ఎన్నికల మ్యానిఫెస్టో
ఊరించే ఐస్ క్రీమాయె

మంచికాల ముండాలని
కొండంత ఆశ పడి
ఆవిర్భావం జెండకు
జేజేలు పలుకుతూ
వారేవ్వా ప్రజలారా
సెనార్థులు చేయండి

 రమేశ్ గోస్కుల
కైతికాల సృష్టికర్త
హుజురాబాద్.

జూన్ 2,                                                    తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా..

0/Post a Comment/Comments