*పచ్చని జీవితాలకు కావాలీ పచ్చదనం*

*పచ్చని జీవితాలకు కావాలీ పచ్చదనం*

*నిలకడలేని జగానికిది*
*నిలువెల్లా దహించే నిజం..*

అవును..
అది మింగుడు పడని విషయమే అయినా
నడమంత్రపు జీవితానికై
పాకులాడతోంది కాలం..
నవీనమని చెప్పిన లోకమే
నరకప్రాయానికి దారులు వేస్తూ..
మురిసిపోతోంది మహదానందంగా...

నివురు గప్పిన నిప్పే
చాపకింద నీరులా జగమంతా
పారుతోంది పరిధనేదే లేకుండా..

నింగికిసిరినదేదైనా నేలను చేరినట్లుగానే
నర తప్పిదనమే నట్టేటా ముంచుతూ..
నిశ్శబ్ద గీతమేదో మెల్లగా విస్తరించి
మరణ శాసనమై మనుగడనే ప్రశ్నిస్తోంది..

నాడున్న ప్రకృతి శోభ నేడేమో కానరాక
విలవిలలాడుతూ కదలలేని జీవమౌతూ..
ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టూ..
తిలాపాపం తలా పిరికెడుగా మోస్తోంది నేటి తరం..

నింగీనేలంతా కలుషితమై విషమేదో పంచగా..
మరణమృదంగాన్నే వినిపిస్తు
బొమికల భవితను ఇవ్వబోతోంది రాబోయే కాలం...
*అందుకే..*
ఇకనైనా కలిగిన కనువిప్పుతో..
అవనిపైకి అతిథులోలే వచ్చిన మనం
అతిథుల్లాగే వెళదాం..
అంతమొందించే సాహసమేదో చేయక
పచ్చని జీవితాలకై పచ్చదనం నింపి ప్రగతికి బాటలు వేద్దాం...

*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*
🌱🌴🪴🌺☘️🎄🌲🌸🌾🌳🌲🌺🍀🪴☘️🌿🌺🌳

0/Post a Comment/Comments