తర తరాల ముసుగులో నలుగుతున్న వనితలు.....
బంధాల పంజరాన చిక్కుకున్న పక్షులు....
తనను తాను మరచిపోయి సాగే జీవితాలు...
మారవా....ఏ నాటికి ,జగతిన వీరి రాతలు...
స్త్రీ అంటె
అబల కాదు, సబల అంటూ ప్రసంగాలు పలికేరు...
మనసుకి గాయం చేసి పెడ రెక్కలు విరిచెరు.....
తనకు కూడా మనసుందను విషయమే మరిచేరు....
తన ఆశల గుప్పిళ్ళ కు సంకెళ్ళు వేసేరు....
తన స్వేచ్చ లోకాన్ని మార్చి ,తమాషలు చూసేరు..
ఎన్నాళ్ళు ఎన్నాళ్లు.........చెయ్యాలి పోరాటాలు
బందాల ఊసులలో బందీగా వుండాలా...?
ఆమె ఆశల మాలికలు బూజు పట్టి పోవాలా......?
ఆంక్షల గోడల నడుమ కొయ్యబారి పోవాలా.....?
మనసులేని శిలలై అచేతనులు అవ్వాలా .....?
తనలా తను బ్రతక లేని శిఖరాలుగ మిగలాల.....
తర తరాల ఈ ముసుగు ఎప్పటికి తొలిగేను......
తరణుల హృదయజ్వాల ఏ నాటికి మలిగేను.....
జ్వలించి జ్వలించి ఉప్పెనవ్వక ముందే మారండి...
జగతిని జాగృతం చేసే ఆమే సంకెళ్ళు త్రు0చండి.....
తన ఆశల అల్లికలకు ఆధారమై నిలవండి....
మీ ఇడుకుళ్ళ గాయత్రి
వాంగ్మూలం:ఇది నా స్వీయ రచన.
.