ముత్యాల జల్లులు--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

ముత్యాల జల్లులు--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

ముత్యాల జల్లులు
----------------------------------
నిద్దుర వేళకు పోయెదము
ప్రొద్దు ప్రొద్దున లేచెదము
శ్రద్ధగా పళ్ళు తోమెదము
బుద్దిగా బడికి వెళ్లెదము

హద్దులు దాటక ఉండెదము
సుద్దులు బాగా చెప్పెదము
వృద్ధులను బాగా చూసెదము
వృద్ధిలోనికి వచ్చెదము

పెద్దల మాటలు వినెదము
ఉద్ధరింపబడెదము
బద్దకాన్ని వీడెదము
ఉద్దారకులయ్యెదము

ఎద్దు వోలె శ్రమించెదము
గద్దెపై కూర్చుండెదము
ఎద్దుల బండి ఎక్కెదము
మద్దెలచెరువు పోయెదము
--గద్వాల సోమన్న ,
      ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments