శీర్షిక: బస్సులో ప్రయాణమా? పేరు: సి. శేఖర్(సియస్సార్)

శీర్షిక: బస్సులో ప్రయాణమా? పేరు: సి. శేఖర్(సియస్సార్)శీర్షిక: బస్సులో ప్రయాణమా?

బస్సు ప్రయాణం
నేడు గాల్లో ఎగిరినంతగా
పట్టపగలే చుక్కలు కనిపించేంత ఖరీదైంది
నేడిదో దోపిడి వ్యవస్థ
పల్లెవెలుగైనా లగ్జరీయైన
ఎవరైనా సరే వారి స్థాయికితగ్గదోపిడి
చార్జీల మోతమోగిస్తూ
ప్రజలపై దండయాత్ర

చేతకాని పాలకులు
ప్రభుత్వ సంస్థలనన్నొక్కొక్కటి
ప్రైవేటుకు ధారదత్తంజేస్తూ
మీసాలుమెలేస్తుంటాయ్
ఉచితపథకాల ఊబిలో తోసేసి 
లోటును సృష్టిస్తూ
పూటను గడుపుతున్న దద్దమ్మలు
వాపును బలుపంటూ సొల్లుగక్కె కేటుగాళ్ళ రాజ్యమిది
నిత్యవసరాలెపుడు నింగిలోనే
ధరాఘాతంలో బతుకు బంగాళాఖాతంలో
కార్పోరేట్ కాలర్ల కాపలదారులు
బజాప్తగా ఏ భారమైన సుతిమెత్తగా ప్రజలనెత్తిపైకి నెట్టేసే నేర్పరులు
ఇక్కడ సామాన్యుల బతుకు
ధరలన్ని హిమాలయశిఖరంపై
అభివృద్ధి అందఃపాతాలంలో
చమురే నేడు దేశాభివృద్ధి
ప్రతీది దానిచుట్టే పరిభ్రమణం
సామాజిక పరిణామం
ఎవడిపంథా వాడిది
ఎవడి దందా వాడిది
అజెండా మాత్రమొక్కటే
జలగలా ప్రజల సంపద దోచేయడమే
దినదినం పెరిగే ధరల పంజరంలో
దారితెలియని అయోమయంలో దీనజనం
పరిష్కారం దొరకని పద్మవ్యూహంలో దారితెలిసినా  
అందులైన ఆధునిక జీవనగమనాలు

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.


0/Post a Comment/Comments