నాన్న

నాన్న

శీర్షిక.సృష్టి ప్రాధాత
అమ్మ సృష్టి కర్త అయితే
నాన్న  సృష్టి ప్రదాత
ఇద్దరు లేనిది సృష్టిగమనం లేదు
ఎందుకో అమ్మకు ఉన్న గుర్తింపు నాన్నకు లేదు
గుర్తింపు లేమి అనే వ్యధ లేకుండా వేదనలు ఎన్ని ఉన్నా
పిల్లల కోసం కరిగే హిమాం నాన్న
అమ్మ తడ బడకుండా చేతులు పడితే తుది వరకు వెన్నుపూస అయి నిలిచేది నాన్న
తన సౌఖ్యాల ను పక్కనబెట్టి
పిల్లల సౌఖ్యం కోసం తపించే
తపస్వి
ఎంత ఎత్తుకు ఎగిరే గాలిపాట0 అయిన
ఆధారం దారం అలాంటి ధారమే నాన్న
  బార్డర్ లో సైనికుడు
  ఇంట్లో నాన్న నే హీరో
అడ్డుతగులుతున్నాడు అని
బాల్యంలో
చాదస్తం చేస్తున్నాడు అని
టీనేజ్ లోఇసడి0చుకుంటాం
మనం తండ్రులు అయిన
తర్వాత స్మశానం లో
ఓ జ్ఞాపకం గా మిగిపోతున్నాడు నాన్న
ఎన్ని అర్ధాకలి తో గడిపాడు
ఎన్నో త్యాగాలు చేసాడో
నాన్న
నేటి కాలం మన ఎదుగుదల
కు అహర్నిశలు శ్రమించిన
నాన్నకు వృద్ధాప్యంలో
ఒక మూలన చోటు కూడా లేక
ఆస్తి కోసం అయ్యాను హతమార్చే కొడుకులు
ప్చ్ ప్చ్ ప్చ్ ఇదేమి న్యాయం
అమ్మను గౌరవి0చక పోతే పాపం
నాన్న ను గౌరవి0చ క పోతే
తప్పక తగులుతుంది శాప
ఉమశేషారావు వైద్య
లెక్చరర్ జి.జె.సి దోమకొండ

0/Post a Comment/Comments