ఒక ఛాయా చిత్రం
సృష్టి వైచిత్రి
అమ్మ కడుపులో
మూడు నెలల పిండంగా
అనుకున్నారేమో గండంగా
ఈ లోకాన్ని చూడక ముందే
నాన్న చంపబడడం
నేను నాన్న అయి
పిల్లల ఆత్మీయ స్పర్శ
కలిగినప్పుడల్లా సముద్రపు
ఆటుపోటుల్లా భావోద్వేగమైన స్పందనలు
నాన్న గురించి నలుగురు
చెప్పింది విని
ఆయన లోని త్యాగాలు గురించి వివరిస్తే నాకళ్ళు
చెమర్చి అంతర్లీనంగా అశ్రువులు రాలుతూనే ఉంటాయి
నాన్న అనే పిలుపు ను ఎవ్వరిని పిలువగలం
ఎలా ఉండేదో బంధం
మిగితా 8 మంది పొందిన
అనుభూతి నాకు లేమి అయి
అనుభూతులు ఆశ్లేష0
అయిన ఆదర్శలు
ఆటకెక్కిచ్చి న
మేము
వెన్నుపూస తానై రేపటి భవితకు ఆస్తులు ఇస్తే
హారతి కర్పూరం చేసి
ఆవగింజ అంత అయిన
మిగిల్చనిగొప్పోల్లం
చెట్టు పేరు చెప్పి కాయలు
అమ్మిన చందం అయి
నీవు నా హీరో వు
నీ ఫోటో చూసినప్పుడు
ఆకాశం లో మేఘాలు కదిలినట్టు ఒక ఆత్మీయ స్పర్శ
రహిత జీవనం ఒక వేదనం
అయ్యి
నేను తండ్రి అయి తండ్రి జ్ఞాపాకం లేని
ఒక జీవి
రెండుకళ్ళు ఉండి ఒకే కన్నుతో
అమ్మే అన్ని అయి పెంచిన
నాన్న ఒక గులాబీ
ఎన్ని ముళ్ళు ఉన్న దాని విలువ సుగంధభరితం
నాన్న నీవులేకపోవడం ఒక చేదు జ్ఞానపకం
అయిన నీవే నిత్యసుప్రభాత గీతం ..నా చాలనననికి గమననికి ప్రతిరూపం
మళ్ళీ జన్మఉంటే నీ సుతుడై
పుట్టే అవాకాశం ఇవ్వు నాన్న
నీ స్మృతి పథం లో నీవు పేరు పెట్టబాగ్యం
పొందని ఆభాగ్యున్ని
ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి
9440408080