మా ఊరు(బాలగేయం) సోమన్న

మా ఊరు(బాలగేయం) సోమన్న

మా ఊరు
(బాలగేయం)
----------------------------------
ఊరు ఊరు మా ఊరు
ఊరు ప్రక్కన సెలయేరు
కోవెల నడుమ  కోనేరు
చెంత ఉన్నది  ఒక తేరు

అందమైనది మా ఊరు
అందరి క్షేమమది కోరు
ఆదర్శముకు మారు పేరు
హుందాదానం ఊరు తీరు

పొలాల గట్టున నీరు
గలగల ధ్వనితో పారు
కనువిందు చేయును ఊరు
ఎవరూ వర్ణించ లేరు

ఆత్మీయతకు మా ఊరు
తొలి స్థానంలో చేరు
ఆదరించును మా ఊరు
అమ్మ వంటిది మా ఊరు
--గద్వాల సోమన్న ,
      ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments