బాలల ఆశయం --గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

బాలల ఆశయం --గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

బాలల ఆశయం
--------------------------------------
కరిగి కరిగి క్రొవ్వొత్తిలా
వెలుగుపూలు రువ్వుతాం
ఒదిగి ఒదిగి  మొక్కలా
జీవితాన ఎదుగుతాం

అందమైన పూవుల్లా
తావులు వెదజల్లుతాం
నింగిలోని తారల్లా
హృదయాలు దోచేస్తాం

కొలనులోని కలువల్లా
కనువిందు చేసేస్తాం
కంటిలోని పాపల్లా
లోకాలను చూపిస్తాం

విహరించే పక్షుల్లా
ఆనందం పంచుతాం
ప్రవహించే ఏరుల్లా
పదిమందికి సాయపడుతాం
--గద్వాల సోమన్న ,
       ఎమ్మిగనూరు. 

0/Post a Comment/Comments