నోట్ పుస్తకాల పంపిణీ

నోట్ పుస్తకాల పంపిణీ

నోట్ పుస్తకాల పంపిణీ  28.6.2022
     నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం అనంతవరం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం నాడు విద్యా స్వేచ్ఛా ఫౌండేషన్ చైర్మన్ వాసుదేవరావు గారు, పూర్ణచంద్రరావు గారు సభ్యులు మహేష్ అండ్ బ్రదర్స్ కలిసి తొమ్మిది వందల నోటు పుస్తకాలు, పెన్నులు ,పెన్సిళ్ళు, ఎరేజర్, షాప్ నర్స్ (కిట్స్), పలకలు పంపిణీ చేశారు.
    ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండూరు ఉమామహేశ్వర్, గ్రామ సర్పంచ్ సహదేవుడు, ఎస్ఎంసి చైర్మన్ రాములు, ఉపాధ్యాయినులు మరియమ్మ, జయమ్మ, గౌతమి, కవిత, సరస్వతి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
    ఈ సందర్భంగా హెచ్ ఎం ఉమామహేశ్వర్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ వారు విద్యార్థులకు కావలసిన నోట్ బుక్స్ ,పెన్నులు, పెన్సిళ్ళు మొదలైనవి ఇచ్ఛి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు .అంతేగాక విద్యా స్వేచ్ఛా ఫౌండేషన్ చైర్మన్ వాసుదేవ రావు గారిని, పూర్ణచంద్ర రావు గారిని ఘనంగా సత్కరించారు.

0/Post a Comment/Comments