హితోక్తులు
----------------------------------
గొప్ప వారి స్నేహము
మెప్పు కలుగజేయును
ముప్పు నుంచి తప్పించి
గొప్పతనము నొసగును
అప్పు తెచ్చు కీడును
తప్పులు చేయించును
ఒప్పుగా జీవించి
చెప్పవలెను ఘనతను
చక్కనైన పనులు చేసి
చుక్కలా వెలుగవలెను
చక్కని మార్గంలో
తిన్నగా వెళ్ళవలెను
గట్టి పనులు చేయాలి
మెట్టు మెట్టు ఎక్కాలి
గట్టులా ఉండాలి
చెట్టుపై ఫలమవ్వాలి
--గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.