విప్లవ జ్యోతి శ్రీశ్రీ-గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు

విప్లవ జ్యోతి శ్రీశ్రీ-గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు

విప్లవ జ్యోతి  శ్రీశ్రీ
--------------------------------------
విప్లవ గీతాలకు సారథి
తెలుగు సాహిత్యాన వారధి
మండే సూర్యుడు కవిరవి శ్రీశ్రీ
తెలుగోళ్ల గుండెలో ఉగాది

శ్రామికుల  ఛైతన్య గీతిక
వారి జీవితాల్లో దీపిక
అభ్యుదయ కవులకు శ్రీశ్రీ
ఆదర్శ, అపురూప కానుక

మహా ప్రస్థానం వ్రాసెను
మరో ప్రపంచాన్ని కోరెను
శ్రీశ్రీ ఖడ్గ సృష్టి చేసెను
అభివృద్ధికి బాటలు వేసెను

నవయుగ వైతాళికుడు శ్రీశ్రీ
కార్మికులకు పెన్నిధి శ్రీశ్రీ
సరికొత్త ఒరవడికి శ్రీశ్రీ
శ్రీకారం చుట్టెను శ్రీశ్రీ

-గద్వాల సోమన్న ,
      ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments